why market is down today: దేశంలోకి HMPV వైరస్ కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో రెండు కేసులు నమోదు కావడంతో.. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా పతనమయ్యాయి. ఎప్పుడు లేనంతగా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. మొత్తం 324 స్టాక్‌లు లోయర్ సర్క్యూట్ పరిమితులను తాకాయి. రెండు కేసులను గుర్తించిన వెంటనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్‌లో 1236 పాయింట్లు పతనమై 77,959.95 స్థాయికి పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 402 పాయింట్లకు పడి 24000కు పతనమైంది. Panic Selling in Stock Market owing to News of 1st HMPV case in India. Please note this is not like covid and there is no need for panic. This is just a respiratory infection. Nothing to panic. — Mumbai Nowcast (@s_r_khandelwal) January 6, 2025 ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే కేవలం ఒక్క పూటలోనే రూ.9 లక్షల కోట్లు.. కర్ణాటకలో మొదటి కేసు రావడంతో బీఎస్‌ఈలో మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా రూ.9 లక్షల కోట్లకు పైగా తగ్గిపోయింది. కేవలం ఒక్క పూటలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోవడంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఇలానే కేసులు పెరిగితే ఇన్వెస్టర్లు మళ్లీ నష్టాలను చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇది కూడా చూడండి: KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు The stock market is filled withindividuals who know the price ofeverything, but the value of nothing — Forest (@Forest007_) January 6, 2025 ఇది కూడా చూడండి: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే! దేశంలో బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకింది. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వచ్చిన నివేదిక ప్రకారం శిశువుకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇంకా తమ ల్యాబ్ లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను తాము అనుమానించాల్సిన అవసరం లేదని అంటున్నారు. రెండో కేసు కూడా బెంగళూరులోనే నమోదైంది. ఇది కూడా చూడండి: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా