/rtv/media/media_files/2025/03/20/Ae7MbPfiDsJPj9wWRzBx.jpg)
Vivo Y19e launched with 50MP camera
వివో తన కొత్త వై సిరీస్ స్మార్ట్‌ఫోన్ 'Vivo Y19e'ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌లో యూనిసోక్ T7225 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ AI సపోర్ట్ ఉన్న కెమెరా సెటప్ ఉంది. ఇందులో 6.74-అంగుళాల డిస్ప్లే, 5,500mAh బ్యాటరీని అందించారు. ఇప్పుడు ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర మొదలైన వాటి గురించి తెలుసుకుందాం.
Also Read: నీ భార్యతో ఇలానే చేయిస్తావా? శేఖర్ మాస్టర్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Vivo Y19e Price
Vivo Y19e ధర విషయానికొస్తే.. Vivo Y19e ఫోన్ సింగిల్ వేరియంట్‌తో వచ్చింది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ మెజెస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, రిటైల్ షాప్‌లలో సేల్‌కు అందుబాటులో ఉంది.
Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. సెలబ్రిటీలపై ఫిల్మ్‌ఛాంబర్ షాకింగ్ రియాక్షన్..
Vivo Y19e Price Specifications
Vivo Y19e ఫోన్ 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ యూనిసాక్ T7225 చిప్‌సెట్ అమర్చబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14 పై నడుస్తుంది. ఈ ఫోన్ 167.3 మిమీ పొడవు, 76.95 మిమీ వెడల్పు, 8.19 మిమీ మందం, 199 గ్రాముల బరువుతో వస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఇది IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ SGS, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అదే సమయంలో కెమెరా గురించి తెలుసుకుందాం. వివో Y19e వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 0.08-మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది AI ఎరేస్, AI ఫోటో ఎన్‌హాన్స్ వంటి అనేక AI ఆధారిత ఫీచర్లకు మద్దతు ఇస్తుంది.