/rtv/media/media_files/2026/02/19/google-2026-02-19-10-54-26.jpg)
న్యూఢిల్లీ(new-delhi) లోని భారత్(india) మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026(AI Impact Summit 2026) నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి. గూగుల్(google), మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి కంపెనీలు మన దేశంలో ఏఐ డేటా సెంటర్లు, కొత్త ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించనున్నట్లు ప్రకటించాయి.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రధాని మోదీతో భేటీ అయి, రాబోయే ఐదేళ్లలో భారత్‌లో సుమారు 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీలోని విశాఖపట్నంలో మెగా ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఇది ఏఐ మోడల్ ట్రైనింగ్, క్లౌడ్ సర్వీసులకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. దీనితో పాటు 'అమెరికా-ఇండియా కనెక్ట్' పేరుతో కొత్త ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్‌ను కూడా గూగుల్ తీసుకురాబోతోంది.
మైక్రోసాఫ్ట్ వచ్చే నాలుగేళ్లలో గ్లోబల్ సౌత్ దేశాల్లో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. గత ఏడాది భారత్‌లో ప్రకటించిన 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఇది అదనం. ముఖ్యంగా 20 లక్షల మంది ఉపాధ్యాయులకు, 80 లక్షల మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్యాలను నేర్పించే బాధ్యతను మైక్రోసాఫ్ట్ తీసుకుంది.
Also Read : దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు
ముంబై, చెన్నైలలో ఏఐ డేటా సెంటర్లు
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ చిప్స్ తయారు చేసే ఎన్విడియా, భారతీయ ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీరిద్దరూ కలిసి భారత్‌లో గిగావాట్ స్థాయి ఏఐ ఫ్యాక్టరీని నిర్మించబోతున్నారు. ముంబై, చెన్నైలలో ఈ ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే యొట్టా సంస్థ కూడా ఎన్విడియా చిప్స్ కోసం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.
ఈ సమిట్ సందర్భంగా భారత్ ఒక అద్భుతమైన ఘనత సాధించింది. కేవలం 24 గంటల్లో 2.5 లక్షల మందికి పైగా ప్రజలు ఏఐ బాధ్యతాయుత వినియోగంపై ప్రతిజ్ఞ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. టెక్నాలజీని ఎంత వేగంగా వాడుతున్నామో, అంతే బాధ్యతగా వాడతామని ప్రపంచానికి చాటిచెప్పారు.
షరద్ సంఘీ స్థాపించిన Neysa AI అనే భారతీయ స్టార్టప్, బ్లాక్‌స్టోన్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10,000 కోట్లు) భారీ ఫండింగ్‌ను సేకరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చాట్‌బాట్‌లు కాకుండా, ఏఐకి కావలసిన సాంకేతిక మౌలిక సదుపాయాలను తయారు చేస్తుంది.
Also Read : కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు
Follow Us