/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/markets-jpg.webp)
stock markets
నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 405 పాయింట్లు పెరిగి 77,311 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ విషయానికొస్తే 126 పాయింట్లు పెరిగి 23,472 వద్ద కొనసాగుతోంది. ప్రారంభంలోనే నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. అయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, కొటక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాలతో ట్రేడ్ అవుతుండగా.. ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ కంపెనీ, ట్రెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
వీటిలో ఇన్వెస్ట్ చేస్తే..
ఇదిలా ఉండగా ఐపీఎల్ సమయంలో కొన్ని రకాల స్టాక్స్‌ను కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌లను క్రికెట్ ప్రేమికులు ఎక్కువగా చూస్తుంటారు. మ్యాచ్ వస్తుందంటే ఇక టీవీల దగ్గరే ఉంటారు. అయితే ఈ సమయంలో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్, క్విక్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ వ్యాపారాల్లో లాభాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతిs
ఐసీసీ ప్రపంచ కప్‌ను ఎలా అంతర్జాతీయగా వీక్షిస్తారో.. ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా అలానే వీక్షిస్తారు. ఒక్కో జట్టులో కనీసం ముగ్గురు అయినా విదేశీ ఆటగాళ్లు ఉంటారు. వీరి వల్ల ఇతర దేశాల్లో కూడా మ్యాచ్‌లు చూస్తారు. దీంతో అక్కడి వారు ఇక్కడికి రావడం, వీసా ట్రాకింగ్ కంపెనీలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ల వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. దీంతో మీరు ఈ ఐపీఎల్ సమయంలో జొమాటో, స్విగ్గీ, హోటళ్లు వంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్