దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ 286.43 పాయింట్లు పెరిగి 79,329 వద్ద ట్రేడ్ మొదలవ్వగా.. నిఫ్టీ 97.45 పాయింట్లు పెరిగి 24,013 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 609.67 పాయింట్లతో 79,653.41 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 174.05 పాయింట్లతో 24,088.20 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు ఈ షేర్లు నష్టాల్లో.. స్టాక్ మార్కెట్‌లో యస్ బ్యాక్ షేర్లు 1శాతం పైగా తగ్గాయి. నిఫ్టీ 30లో సన్ ఫార్మా, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు కాస్త ఒడిదుడుకుల్లోనే నడుస్తున్నాయి. నిన్న స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 80,234 వద్ద ముగిసింది. నిఫ్టీలోనూ 80 పాయింట్ల మేర పెరిగింది. 24,274 వద్ద ముగిసింది. ఈరోజు సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 16 లాభపడగా, 14 పతనమయ్యాయి. ఆటో, ఐటీ, ఎనర్జీ షేర్లలో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అదారీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై ఆ గ్రూప్ వివరణ ఇవ్వడం వల్ల దాదాపు అన్ని స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం చొప్పున లాభపడగా.. అదానీ ఎనర్జీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 10 శాతం చొప్పున రాణించాయి. మిగిలిన షేర్లూ ఓ మోస్తరుగా లాభపడ్డాయి. ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్