Stock Market: లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర మొదలైంది. అయితే డాలర్‌తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది. 

New Update
Stock Markets: భారీ నష్టాల తరువాత వరుసగా రెండో రోజు లాభాల్లో దేశీ మార్కెట్లు

షేర్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ షేర్ మార్కెట్లు నష్టాల్లో ఉండగా.. దేశీయ మార్కెట్లు మాత్రం లాభాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 289 పాయింట్ల లాభంతో 79,692 వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల వద్ద 24,241 వద్ద కొనసాగుతుంది. డాలర్‌తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది. 

ఇది కూడా చూడండి: జగన్‌, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్!

ఈ షేర్లు లాభాల్లో..

ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, పెట్రోలియం, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ షేర్లు నిఫ్టీలో లాభాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, లారెన్స్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 2 శాతం లాభాల్లో ఉండగా, యస్ బ్యాంక్ షేర్లు 9 శాతం పెరిగాయి. 

ఇది కూడా చూడండి: Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు..

ఇదిలా ఉండగా ప్రముఖ కంపెనీ హ్యుందాయ్ ఇటీవల ఐపీఓ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా మొదటి ఐపీఓ ప్రారంభం కానుంది. స్వీగ్గీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6 నుంచి ప్రారంభం కాబోతుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒక రోజు ముందే ఈ ఆఫర్ ప్రారంభం కానుంది.

ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా..

కేవలం మూడు రోజులు మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. నవంబర్ 8న మళ్లీ ముగిస్తుంది. ఇదిలా ఉంటే స్విగ్గీ ఐపీఓతో దాదాపుగా ఒక రూ.10 వేల కోట్లు సమకూర్చాలని కంపెనీ భావిస్తోంది. కొత్త షేర్ల జారీతో రూ.3750 కోట్ల షేర్లను విక్రయించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.750 కోట్లను సమీకరించాలని స్విగ్గీ భావిస్తోంది.

ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు