/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tesla-jpg.webp)
Tesla Entered In India
భారత్ లో అడుగు పెట్టేందుకు టెక్ దిగ్గజం టెస్లా ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. ఇక్కడ మార్కెట్ ఓపెన్ చేయాలని ఎలాన్ మస్క్ చాలా ప్రయత్నాలు చేశారు. ఇన్నాళ్ళకు ఇది కార్యరూపం దాల్చింది. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత మస్క్ భారత్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగాల ప్రకటన విడుదల అయింది. కస్టమర్ రిలేటెడ్, బ్యాక్‌ఎండ్ జాబ్ సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ టెస్లా సోమవారం తమ లింక్డిన్ పేజీలో ఓ ప్రకటన చేసింది.
కంపెనీ ప్రకటించిన ఉద్యోగాలు ఇవే..
1. సర్వీస్ టెక్నీషియన్
2. సర్వీస్ మేనేజర్
3. ఇన్ సైడ్ సేల్స్ అడ్వయిజర్
4. కస్టమర్ సపోర్ట్ సూపర్ వైజర్
5. కస్టమర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
6. ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
7. సర్వీస్ అడ్వయిజర్
8. టెస్లా అడ్వయిజర్
9. పార్ట్స్ అడ్వయిజర్
10. డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
11. బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్
12. స్టోర్ మేనేజర్
ముంబై, ఢిల్లీ రెండు చోట్లా ఈ ఉద్యోగాలు నియమించుకోనున్నట్లు టెస్లా తెలిపింది. కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబయి కేంద్రంగా మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక మరోవైపు భారత్లో మూడు చోట్ల టెస్లా ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఒకటి గుజరాత్ లో, మరొకటి ఏపీలో ఉండేలా చేస్తారని అంటున్నారు. టెస్లా ప్లాంట్లతో పాటు ఇండియాలో మూడు షోరూమ్స్ ప్రారంభించాలని కూడా టస్లా ప్లాన్ చేస్తోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సిటీల్లో టెస్లా ఎక్స్ క్లూజివ్ షోరూమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
విదేశాలనుంచి ఇండియాకు వచ్చే కార్ల మీద ఇప్పటివరకు భారీ సుంకాలు విధిస్తున్నారు. అయితే మొన్న ప్రధాని అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్ తో భేటీ తర్వాత విదేశీ కార్లపై ఉన్న సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 40 వేల డాలర్ల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై బేసిక్ సుంకం తగ్గనుంది. ఇప్పుడు దీని వలన ఇండియాలో టెస్లా కార్ల ఎంట్రీకి రూట్ క్లియర్ అయినట్లు అయింది. త్వరలోనే టెస్లా కార్లు భారత రోడ్ల మీద తిరగనున్నాయి.
Also Read: AP: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..హైటెన్షన్