/rtv/media/media_files/2025/02/26/qy8Fk6wmpJG34nItbwaO.jpg)
sukesh letter to elon musk Photograph: (sukesh letter to elon musk )
ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్ర శేఖర్ బహిరంగ లేఖల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. జైలు నుంచి పలువురికి సంచలన లేఖలు రాసి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. ఆర్థిక నేరాలకు పాల్పడి.. మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ప్రస్తుతం సుఖేష్ ఢిల్లీలోని మండోలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల అతని ప్రియురాలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టిన రోజుకూడా సుఖేశ్ జైలు నుంచి లవ్ లెటర్ రాశాడు.
Also Read : తమిళనాడులో పండగపూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం
తాజాగా ఇప్పుడు ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్‌కు లెటర్ రాశాడు. అందులో ఎలన్ మస్క్ నా మనిషి అని పేర్కొన్నాడు. అంతేకాదు.. US ప్రభుత్వం కొత్తగా సృష్టించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE)కి నాయకత్వం వహించినందుకు అతన్ని అభినందించాడు సుఖేష్ చంద్ర శేఖర్. ఎక్స్ కంపెనీలో సుఖేష్ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఎలన్ మస్క్‌కు రాసిన లేఖలో తెలిపాడు. ఎక్స్ అతనికి ఇష్టమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అని చెప్పుకొచ్చాడు. సుఖేష్ రాసిన లేఖలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను పెద్దన్నయ్య అని పిలిచాడు. ట్రంప్, ఎలన్ మస్క్‌పై అతడు ప్రసంశల వర్షం కురిపించాడు.
Also Read: BIG BREAKING: ఆర్మీ విమానం క్రాష్.. 10 మంది మృతి
గతంలో సుఖేష్ కంపెనీ ఎల్ఎస్ హోల్డింగ్స్ టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిందని, గణనీయమైన లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్స్ కంపెనీలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నానని అన్నారు. తన ఆఫర్‌ను అంగీకరించాలని లేఖలో కోరాడు. జైలు నుంచి ఇలాంటి బహిరంగ ప్రకటనలు, లేఖలు రాయడం సుఖేష్‌కు ఇదేం మొదటి సారికాదు. గతంలో అతడు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు లేఖలు రాశారు.