/rtv/media/media_files/3BXMV2CedYmao1iUk39N.jpg)
నిన్న స్టాక్ మార్కెట్ (Stock Market) లో క్షీణత కనిపించింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,235 పాయింట్ల పతనంతో 75,838 వద్ద ముగియగా.. నిఫ్టీ కూడా 320 పాయింట్లు క్షీణించి 23,024 వద్ద ముగిసింది. కానీ ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల్లో ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయినా కూడా మదుపర్లు కనిష్టాల దగ్గర కొనుగోళ్ళు చేయడంతో సూచీలు లాభాలను అందుకుంటున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో 76,150 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీలో సుమారు 100 పాయింట్ల పెరుగుదల ఉంది. ప్రస్తుతం ఇది 23,100 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో, 30 సెన్సెక్స్ స్టాక్‌లలో సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్, ఐటీసీ, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటూ 20 స్టాక్స్ పెరిగాయి. మరో 10 క్షీణించాయి. ఐటీ, ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్ షేర్లలో ఎక్కువ లాభం ఉంది. అదే సమయంలో, మెటల్ మరియు పవర్ స్టాక్స్ లో ఒత్తిడి కనిపిస్తోంది. ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 1.48%, కొరియా కోస్పి 0.67% చొప్పున పెరిగాయి. చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.84 శాతం క్షీణించింది.
Also Read: Bengaluru: బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్
Also Read : బిగ్ బీకి కలిసొచ్చిన రియల్‌ఎస్టేట్.. రూ.83 కోట్లకు అపార్ట్‌మెంట్
మళ్ళీ పెరిగిన బంగారం..
మరోవైపు ఈ రోజు బంగారం ధరలు (Gold Rates) విపరీతంగా పెరిగాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు ఈ రోజు అమాంతం ఒక్కసారిగా పైకెగిసాయి. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర 82 వేల మార్క్ ను దాటేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి 7, 5250కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 860 పెరిగి 82 వేల 90కి చేరింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,250 ఉంటే..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,090గా ఉంది.
Also Read:USA: గ్రేట్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి..ట్రంప్
Also Read : మందుబాబులకు మత్తెక్కించే వార్త.. KF మళ్లీ వచ్చేస్తోంది!