/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
Stock Markets
కొత్త ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల వల్ల నేడు స్టార్ మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 450 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 23,400 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది.
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఈ షేర్లు నష్టాల్లో..
ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 374 పాయింట్ల నష్టంతో 77035 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 23433 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30లో ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎంఅండ్‌ఎం, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా షేర్లు ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
ఇదిలా ఉండగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఏకంగా రూ.41 రూపాయలు తగ్గిస్తూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1762కు చేరుకుంది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 44 తగ్గి, రూ. 1,985.50కి చేరింది.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
2025 ఫిబ్రవరి ఒకటో తేదీన కమర్షియల్ సిలిండర్ ధరను రూ.6.50 తగ్గించారు. మార్చి ఒకటో తేదీన రూ. 5.5 రూపాయలు పెంచారు. కమర్షియల్గ్యాస్ సిలిండర్లను ఎక్కువగా హోటల్, రెస్టారెంట్లలలో ఉపయోగిస్తుంటారు. ఈ ధరలు తగ్గితే రెస్టారెంట్లపై భారం తగ్గుతుంది. తద్వారా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కస్టమర్లకు ఉపయోగకరం అవుతుంది.