/rtv/media/media_files/2025/01/23/awOdnqnpZPLfjgEbyrQr.jpg)
Samsung Galaxy S25 Ultra, Galaxy S25 and Galaxy S25+ Prices in India Announced
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తాజాగా తన Galaxy స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. భారతదేశంలో Samsung Galaxy S25, Galaxy S25+, Galaxy S25 Ultra ఫోన్లను లాంచ్ చేసింది. Galaxy S25 Ultra కొత్త అల్ట్రావైడ్ కెమెరాతో పాటు మరిన్ని అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. Samsung తాజాగా భారతదేశంలోని మూడు మోడళ్లకు సంబంధించిన ధర వివరాలను ప్రకటించింది.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!
ధర వివరాలు
Samsung Galaxy S25 మూడు కలర్‌లలో వస్తుంది. అందులో Icyblue, Silver Shadow, Navy కలర్‌లను కలిగి ఉంది. అలాగే రెండు RAM, స్టోరేజ్ ఎంపికలతో వస్తుంది. అందులో 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.80,999 కాగా, 12GB RAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.92,999గా ఉంది.
అలాగే Samsung Galaxy S25+ రెండు కలర్‌లలో వస్తుంది. అందులో నేవీ, సిల్వర్ షాడోను కలిగి ఉంది. Galaxy S25 లాగానే RAM + స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 256GB వేరియంట్ ధర రూ.99,999 కాగా, 512GB వేరియంట్ ధర రూ.1,11,999గా ఉంది.
అతిపెద్ద Galaxy S25 Ultra మోడల్ విషయానికొస్తే.. వేరియంట్‌ను బట్టి కొన్ని ప్రత్యేక కలర్ ఎంపికలు ఉన్నాయి. 256GB + 512GB ఎంపికలు రెండూ టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం గ్రే, టైటానియం వైట్ సిల్వర్, టైటానియం బ్లాక్ కలర్‌లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.1,29,999, రూ.1,41,999గా ఉన్నాయి. అలాగే టాప్-ఎండ్ 12GB RAM + 1TB స్టోరేజ్ ఆప్షన్ ఒకే టైటానియం సిల్వర్‌బ్లూ ఫినిషింగ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,65,999గా నిర్ణయించారు.
Also Read : ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
డెలివరీ డీటెయిల్స్
మూడు మోడళ్లకు ప్రీ-ఆర్డర్‌లు గురువారం (అంటే ఈరోజు) నుండి రిటైల్ స్టోర్, Samsung వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమయ్యాయి. Galaxy S25 సిరీస్‌ను ప్రీ-ఆర్డర్ చేయడం ద్వారా వినియోగదారులు రూ.21,000 విలువైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అంతేకాకుండా సామ్‌సంగ్ వెబ్‌సైట్ నుండి తమ Samsung Galaxy S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీఆర్డర్ చేసే వారు ఫిబ్రవరి 4 నుండి ముందస్తు డెలివరీని కలిగి ఉంటారు.