/rtv/media/media_files/2025/01/23/BN8PevJdKwVUfDmsl8Ad.jpg)
jio new recharge plans
Jio Recharge Plans: ట్రాయ్ ఇటీవల అన్ని టెలికాం కంపెనీలకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ రీఛార్జ్ ప్లాన్‌లను మాత్రమే అందించాలని తెలిపింది. ఇందులో భాగంగానే ప్రముఖ అగ్ర టెలికాం సంస్థ జియో తాజాగా కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో రూ.458, రూ.1958 వంటి రెండు కొత్త ప్లాన్‌లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!
రూ.458 ప్లాన్
జియో రూ.458 ప్లాన్‌లో కేవలం వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1,000 ఎస్ఎంఎస్‌లను పొందొచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో జియో సినిమా(నాన్ ప్రీమియం), జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
Also Read : ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
రూ.1958 ప్లాన్
జియో నుంచి మరో ప్లాన్ ధర రూ.1958. ఇది ఏడాది ప్లాన్. ఇందులో కూడా కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్స్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. అలాగే ఇందులో జియో సినిమా(నాన్ ప్రీమియం), జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్‌కు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
Also Read: ఫ్లాట్ ఇప్పిస్తానని మంత్రి చెల్లెల్ని మోసం.. మాజీ ఎమ్మెల్యే దంపతులు అరెస్ట్!
ఇదిలా ఉంటే గతేడాది జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీలు భారీగా తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. దాదాపు 50 నుంచి 100 మధ్య అదనంగా పెంచాయి. దీంతో చాలా మంది వినియోగదారులు వేరె వేరె నెట్‌వర్క్‌లకు పోర్ట్ అయ్యారు. ఎక్కువగా జియో యూజర్లు వేరే నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. ఇక జియో ఇప్పుడిప్పుడే కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించడంతో మళ్లీ యూజర్లు పెరుగుతున్నారు.