/rtv/media/media_files/2025/03/19/c1jakjaHu6nMTGB3OZd5.jpg)
Realme P3 Ultra 5G launched in India
ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మి భారతదేశంలో తనదైన శైలిలో దూసుకుపోతుంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అదగొడుతోంది. తాజాగా ఈ కంపెనీ భారతదేశంలో రియల్‌మి పి3 సిరీస్‌లో రియల్‌మి పి3 అల్ట్రా 5జి (Realme P3 Ultra 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.83-అంగుళాల 1.5K 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే సమయంలో MediaTek Dimensity 8350 Ultraతో వస్తుంది. ఇప్పుడు దీని వేరియంట్స్, ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
Realme P3 Ultra 5G Price
Realme P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.
8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999
8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999
12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
ఈ ఫోన్ నేటి నుండి realme.com, Flipkart, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లలో కస్టమర్లకు బ్యాంక్ కార్డులపై రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపు ఉన్నాయి. దీనితో పాటు 1 సంవత్సరం వారంటీ, 6 నెలల పాటు నో-కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
Realme P3 Ultra 5G Specifications
Realme P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ 6.83-అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i సేఫ్టీతో అమర్చబడింది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌ను అందించారు.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి UI 6.0 పై పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. P3 అల్ట్రా 5G వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.