Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

New Update
oracle sent emails to remaining employees regarding job loss

oracle sent emails to remaining employees regarding job loss

ఐటీ దిగ్గజం ఒరాకిల్‌ ఒక్కసారిగా 30 వేల మంది ఉద్యోగులను తొలగించడం ప్రంపంచ టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈమెయిల్స్‌ ద్వారా ఉద్యోగులను తొలగించింది. ఇది జరిగి 48 గంటలు గడవకముందే ఒరాకిల్ మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. మరో విడుతలో కొన్ని వేల మందిని తొలగించే ఛాన్స్ ఉందంటూ ముందస్తు సమాచారం అందించింది.

Also Read: పూటకో మాట రోజుకో వేషం.. ‘అపరిచితుడు’ సినిమా చూపిస్తున్న ట్రంప్

ఈ మెయిల్ చూసిన కంపెనీ ఉద్యోగులు మరింత ఆందోళనలో ఉన్నారు. తమ ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని తెలియక టెన్షన్‌లో పడ్డారు. ఇదిలాఉండగా మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు ఒరాకిల్‌.. అమెరికా, భారత్‌ సహా ఇతర దేశాల్లో ఉన్న దాదాపు 30 వేల మంది ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించింది. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించామని.. ఇది మీ లాస్ట్ వర్కింగ్ డే అంటూ రాసుకొచ్చింది. 

అయితే ఒరాకిల్‌ ఇప్పుడు ఏఐపై ఫోకస్ పెట్టింది. తమ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను ఏఐ కోసం రెడీ చేసేందుకు నిధులు సేకరిస్తోంది. మెటా, ఓపెన్‌ఏఐ, ఎన్విడియా లాంటి కంపెనీలకు క్లౌడ్ సేవలు అందించడం కోసం దాదాపు 50 బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించాలని ప్లాన్ చేస్తోంది. అయితే నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకే పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా భారీగా లేఆఫ్స్‌ ప్రకటిస్తోంది.  

Also Read: పాక్‌పై దాడికి సిద్ధమైన ఇండియన్ నేవీ.. వెనక్కి తగ్గడానికి కారణం ఇదే!

ఒరాకిల్‌లో ఇతర కంపెనీలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగి నుంచి వచ్చే లాభం తక్కువగా ఉంది. అందుకే లేఆఫ్స్‌ అనివార్యమని కంపెనీ యాజమాన్యం అభిప్రాయపడుతోంది. తొలగించిన ఉద్యోగులకు మొదటి ఏడాదికి 4 వారాల బేసిక్ శాలరీ, ఆ తర్వాత ప్రతీ ఏడాదికి ఓ వారం అదనంగా (గరిష్ఠంగా 26 వారాలు) సెవరెన్స్‌ ప్యాకేజీ అందించనున్నారు. 

Advertisment
తాజా కథనాలు