/rtv/media/media_files/2025/02/21/1qn2jQU9gffPhCGPr0Ov.jpg)
gen 3 Ola S1X Plus Photograph: (gen 3 Ola S1X Plus)
ఇటీవల మార్కెట్‌లోకి జెన్ 3 ప్లాట్‌ఫామ్‌తో ఉన్న ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను స్టార్ట్ చేయాలని ఓలా భావిస్తోంది. ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ స్కూటీని తక్కువ బడ్జెట్‌లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ స్కూటీ ధర, ఫీచర్లు ఏంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!
ఒక్కసారి ఛార్జ్ చేస్తే..
ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. వీటి కంటే ముందు జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కేవలం 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మాత్రమే ఉండేది. అలాగే ఈ జెన్3 ఎస్1 ఎక్స్ ప్లస్ పోర్టబుల్ 750 వాట్ ఛార్జర్‌తో వస్తుంది. దీని బ్యాటరీ పరిమాణం కూడా పెద్దదే. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపుగా 242 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!
ఇందులో మిడ్ డ్రైవ్ మోటారు ఉంది. ఇది 11 కిలోవాట్ల పీక్ పవర్ ఔట్‌పుట్‌ను ఇస్తోంది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్పీడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది 125 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే ఈ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ ధర రూ.1.05 లక్షలు. బెస్ట్ ఫీచర్లతో తక్కువ బడ్జెట్‌లో స్కూటీ తీసుకోవాలనుకుంటే దీనిని తీసుకోవడం బెటర్.
ఇది కూడా చూడండి: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్ గా ముందుకు దూసుకుపోండి!