ATM వాడేవారికి అలెర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సహా పలు బ్యాంకులు తమ కస్టమర్ల లావాదేవీల రూల్స్‌ను సవరిస్తున్నాయి.

New Update
New ATM rules from April 1, Key changes by HDFC, PNB, Bandhan Bank

New ATM rules from April 1

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సహా పలు బ్యాంకులు తమ కస్టమర్ల లావాదేవీల రూల్స్‌ను సవరిస్తున్నాయి. ఇప్పటివరకు ATM కార్డు లేకుండా UPI క్యూఆర్‌ కోడ్‌ స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కస్టమర్లు ఫ్రీగా లేదా అదనపు లావాదేవీగా వాడుకునేవారు. ఏప్రిల్ 1 నుంచి ఈ వేసులుబాటు ఉండదు. 

HDFC బ్యాంక్‌తో పాటు పలు బ్యాంకులు కూడా ఇకనుంచి ATMలలో చేసే UPI ఆధారిత నగదు విత్‌డ్రాలను నెలవారీ ఉచిత ATM లావాదేవీలుగానే పరిగణించనున్నాయి. ఫ్రీగా వచ్చే లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత UPI నుంచి చేసే ప్రతి విత్‌డ్రాపై రూ.23తో పాటు అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  

Also Read: హిస్టరీలో ఫస్ట్ టైం.. రూపాయి భారీ పతనం: 95 మార్క్ దాటిన మారకం విలువ

New ATM Rules From April 1st

మరోవైపు ఎంపిక చేసిన డెబిట్‌ కార్డులపై కూడా రోజువారీ ATM నగదు ఉపసంహరణ పరిమితులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సగానికి తగ్గించేసింది. చాలా కార్డులకు కూడా రోజువారీ పరిమితిని రూ.1,00,000 నుంచి రూ.50,000 చేసింది. బంధన్ బ్యాంక్ ఖాతాదారులు తమ సొంత ఏటీఎంలలో నెలకు అయిదుసార్లు ఫ్రీగా ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ATMలను వాడితే మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు మాత్రమే ఉచితంగానే ఉండనున్నాయి. ఒకవేళ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.10 రుసుము పడనుంది. 

Also Read: మావోల ఏరివేతకు రేపే డెడ్ లైన్..ఆయుధాలు వీడని వారి అంతుచూస్తాం...అమిత్ షా హెచ్చరిక

ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే వీటిని అరికట్టేందుకు డిజిటల్ చెల్లింపుల కోసంOTP మాత్రమే కాకా పిన్ లేదా బయోమెట్రిక్ లాంటి అదనపు ధ్రువీకరణ తప్పనిసరి చేయనున్నారు. యాప్‌ల ద్వారా పదేపదే బ్యాలెన్స్‌ చెక్‌ నామమాత్రపు ఛార్జీలే ఉండనున్నాయి. 

Advertisment
తాజా కథనాలు