Business: స్టాక్ మార్కెట్ క్రాష్..ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లు లాస్

స్టాక్ మార్కెట్ క్రాష్ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చిన్న వాళ్ళ దగ్గర నుంచీ బిలయనీర్లు వరకూ అందరూ విపరీతమైన లాస్ లు ఎదుర్కొంటున్నారు. లాస్ట్ రెండు నెలల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లను నష్టపోయింది. 

New Update
business

Infosys shares Faces Huge Loss

దాదాపు నాలుగు నెలలుగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. దానికి తోడు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు మార్కెట్ ను మరింత కుదేలయ్యేలా చేస్తున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న సుంకాల నిర్ణయం వలన అమెరికా, ఆసియా, భారత మార్కెట్లు అధ:పాతాళానికి దిగజారాయి. లక్షల కోట్లు ఆవిరి అయిపోతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ క్రాష్ తో నాలుగు నెల్లో రూ.86 లక్షల కోట్ల మార్కెట్ విలువ పడిపోయిందని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది. దీని వలన ప్రపంచ మార్కెట్ లో భారత్ విలువ చాలా పడిపోయింది.  మార్కెట్ లెక్కింపు ప్రకారం 20 రోజుల సగటు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లో గత ఏడాది 4శాతం ఉంటే ఇప్పుడు అది 3శాతానికి పడిపోయింది. మామూలుగా అయితే ఎంత సంక్షోభం వచ్చిన తర్వాత 70 రోజుల్లో సూచీలు రికవరీ అవుతాయి. కానీ ఈసారి ఐదు నెలలు అవుతున్నా ఆ సూచనే కనిపించడం లేదు.

భారీగా నష్టపోతున్న బిలయనీర్లు..

స్టాక్ మార్కెట్ పతనంతో చిన్న పెట్టుబడిదారులు వేలల్లో, లక్షల్లో నష్టపోతుంటే..బిలయనీర్లు లక్షల కోట్లలో నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత బిలియనీర్ గౌతమ్ అదానీ కూడా భారీగా నష్టపోయారు. ఈయన సంపదలోని 1 లక్షా 25 వేల కోట్లు ఆవిరి అయిపోయాయి. అది కూడా కువలం 50 రోజుల వ్యవధిలోనే. అదానీ మొత్తం సంపద విలువ 11.9 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1 లక్ష కోట్లు) తగ్గి 66.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అలాగే భారత మరో కుబేరుడు ముకేశ్ అంబానీ ఈ జాబితా 17వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద ప్రస్తుత విలువ 2.9 బిలియన్ డాలర్లు తగ్గి 87.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. హెచ్‌సీఎల్‌ టెక్‌కు చెందిన శివ్‌నాడార్‌ సంపద 4.53 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.39,000 కోట్లు) తగ్గి 38.6 బిలియన్‌ డాలర్లు (రూ.3,32,000 కోట్లు)గా నమోదైంది.

ఇప్పుడు ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి వంతు..

భారత్ లో మరో బిలయనీర్ ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తిదీ ఇదే పరిస్థితి. ఇన్ఫోసిస్ షేరు ధర భారీగా పతనమైయ్యింది. దీని ఫలితంగా ఈ కంపెనీలో వాటా కలిగిన నారాయణ మూర్తి కుటుంబం సంపద రూ. 6,800 కోట్లకుపైగా పడిపోయింది. డిసెంబర్ లో గరిష్ట స్థాయిలను నమోదు చేసిన ఈ స్టాక్, ఆ తర్వాత నుంచి 22 శాతం క్షీణించింది. ఈ ఒక్క రోజులోనే ఇన్ఫోసిస్ షేర్లు 5శాతానికి పైగా పడిపోయాయి. రెండు సెషన్లలో కలిపి 8శాతానికి పైగా క్షీణించాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవి చూశారు. ఇన్ఫోసిస్ షేర్లు 2024 డిసెంబర్ లో గరిష్ట స్థాయి రూ. 2,006 కి చేరుకున్నాయి. కానీ ఈరోజు చూస్తే షేరు ధర రూ. 1,563 స్థాయికి పడిపోయింది. దీనికి కారణం అమెరికా ఆర్థిక మాంద్యమని చెబుతున్నారు. 

ఇన్ఫోసిస్ లో నారాయణ మూర్తి కుటుంబానికి 4.02 శాతం వాటా ఉంది. డిసెంబర్ లో దీని విలువ రూ. 33,163 కోట్లు ఉంటే...ఇప్పుడు తీవ్ర నష్టాల తర్వాత ఆ విలువ రూ.26, 287 కోట్లకు పడిపోయింది. మొత్తం ఫ్యామిలీకి ఉన్న వాటాల విలువలన్నీ తగ్గిపోయాయి. దీంతో అందరూ తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. 

Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు