/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Mutual-Funds-jpg.webp)
Mutual Funds
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బాగా లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే చాలా మందికి ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉండటంతో పాటు లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తక్కువ సమయం మూడేళ్లలో కోటీశ్వరుడు కావాలంటే మాత్రం తప్పకుండా కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అవేంటో తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
వీటిలో పెట్టుబడులు పెడితే..
3 సంవత్సరాలలో గొప్ప రాబడిని ఇచ్చే మ్యూచువల్ ఫండ్ల జాబితాలో మొదటి పేరు నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ గత మూడు సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 17.03 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. అదే సమయంలో ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ పెట్టుబడిదారులకు 15.30 శాతం రాబడిని ఇచ్చింది. బరోడా బిఎన్‌పి పారిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్ కూడా పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది.
ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
ఈ ఫండ్ 3 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 13.47 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. ఈ డేటా ఏప్రిల్ 1, 2025 వరకు ఉన్న రిటర్న్‌లకు సంబంధించినది. దీనితో పాటు కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ కూడా గత 3 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ మూడేళ్లలో పెట్టుబడిదారులకు వార్షిక రాబడి 12.19 శాతం, జేఎం లార్జ్ క్యాప్ ఫండ్ గత 3 సంవత్సరాలలో 12.46 శాతం రాబడిని ఇచ్చింది.
ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి
telugu-news | LATEST BUSINESS NEWS | mutual-funds | latest-telugu-news | today-news-in-telugu | investments-tips | telugu business news