/rtv/media/media_files/2025/01/18/CODXtV7sDqP7gNqCcJzI.jpg)
Jupitar CNG Scooter Photograph: (Jupitar CNG Scooter)
టీవీఎస్ సంస్థ మార్కెట్‌లోకి కొత్త సీఎన్‌జీ స్కూటర్‌ను తీసుకొస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ ఆధారిత స్కూటర్‌ను జూపిటర్ భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2025లో ప్రదర్శించింది. కాన్సెప్ట్ మోడల్‌గా ప్రస్తుతం దీన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ జూపిటర్ సీఎన్‌జీ కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఎప్పుడు పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాదిలోనే దీన్ని లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
TVS Motor Company has introduced the revolutionary TVS Jupiter 125 CNG, marking it as the world’s first CNG-powered scooter. Equipped with a 125cc engine, the scooter boasts an impressive combined range of 226 km on CNG and petrol. While the brand hasn’t announced an official… pic.twitter.com/nmW6nLVqqW
— 91Wheels.com (@91wheels) January 18, 2025
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అర్థరాత్రి ఏం జరిగిందంటే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
గంటకు దాదాపుగా 84 కిలోమీటర్లు..
ఈ టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్‌కి 1.4 కిలోగ్రామ్ కిట్ కూడా ఉంది. ఇది గంటకు దాదాపుగా 84 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అలాగ పెట్రోల్+ సీఎన్‌జీ కలిపి దాదాపుగా 226 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందట. అలాగే రెండు లీటర్ పెట్రోల్ ట్యాంక్‌ను కూడా ఫ్లోర్ బోర్డ్ మౌంట్‌లో పెట్టారు. డిజైన్ అయితే స్టోరేజ్, ప్లాస్టిక్ ప్యానెల్ కవర్, ఫిల్లర్ నాజిల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు.
ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
ఇది 6,000 rpm వద్ద 7.1 bhp శక్తి ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ స్కూటర్ గట్టి పోటీ ఇస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సీఎన్‌జీ వాహనాలు పర్యావరణానికి మేలు చేస్తాయి. సీఎన్‌జీ స్కూటర్లకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. మరి మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇది కూడా చూడండి: Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్
ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు