/rtv/media/media_files/2025/03/27/K8MRLKJjX2XlgakEaGlp.jpg)
Jio Rs 100 plan offers 90 days of JioHotstar subscription
ప్రముఖ టెలికం దిగ్గజం జియో గతంలో ఎన్నో జియోహాట్‌స్టార్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మరో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కోసం బ్లాక్ బస్టర్ ప్లాన్ ప్రకటించింది. కేవలం రూ.100లకే రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చని తెలిపింది. అంతేకాకుండా మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చని ప్రకటించింది. ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
జియో రూ.100 ప్లాన్
రిలయన్స్ జియో తీసుకొచ్చిన రూ.100లతో రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారులకు 5GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. అదే సమయంలో 90 రోజుల పాటు వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. వినియోగదారులు ఈ ప్రీపెయిడ్ ఆఫర్‌లో కాల్స్ లేదా SMS పొందలేరు. కేవలం జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మాత్రమే. ఇందులో అదనంగా IPLతో పాటు జియో హాట్‌స్టార్ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలను ఫ్రీగా చూడొచ్చు.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
ఇతర ప్లాన్‌లు
ఈ రూ.100 ప్లాన్‌తో పాటు.. జియో రూ. 299, రూ. 349, రూ. 899, రూ. 999 ధరల ప్లాన్‌లతో సహా మరెన్నో ఇతర రీఛార్జ్ ఆప్షన్‌లను కలిగి ఉంది. ఇవన్నీ జియోహాట్‌స్టార్‌కు ఫ్రీగా 90 రోజుల సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. జియో వెబ్‌సైట్ ప్రకారం.. రూ.299, రూ. 349 ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. అలాగే 100 ఉచిత SMS, రోజువారీ 1.5GB, 2GB డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాలింగ్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. రూ.349 ప్లాన్‌లో అపరిమిత 5G డేటా కూడా ఉంటుంది.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఇక రూ.899, రూ.999 ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులు వరుసగా 90, 98 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ బెనిఫిట్స్‌తో వస్తాయి. రూ.899 ప్లాన్ అదనంగా 20GB డేటాను కలిగి ఉంటుంది. ఈ రెండు ప్లాన్‌లు వినియోగదారులకు అపరిమిత 5G డేటా అందిస్తాయి.
( jio recharge offers | jio-recharge-plan | ipl-2025 | latest-telugu-news | telugu-news )