Jio Cheapest Recharge Plan: ఇదేంది మావా ప్లాన్ అదిరింది.. జియో చీపెస్ట్ రీఛార్జ్ ధర- 90 రోజులు ఫ్రీ హాట్‌స్టార్

జియో తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.319తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 90 రోజులపాటు ఫ్రీగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ SMS, రోజుకు 1.5GB డేటా కూడా వస్తుంది.

New Update
jio cheapest recharge plan rs 319 free jiohotstar subscription 90 days

jio cheapest recharge plan rs 319 free jiohotstar subscription 90 days

ప్రస్తుతం చాలా రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏ రీఛార్జ్ మనకు బెస్ట్, ఏది అయితే మనకు పొదుపుగా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, బిఎస్‌ఎన్‌ఎల్ వంటి ఎన్నో ప్రముఖ టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి వివిధ ధరలు, బెనిఫిట్స్‌తో కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

అలాంటి సమయంలో కూడా కస్టమర్‌కు తక్కువ ధర, ఎక్కువ బినిఫిట్స్ గల రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవడం కొంచెం కష్టమవుతుంది. మరి మీరు కూడా అలాంటి తర్జన భర్జన పడుతుంటే.. మీ ముందుకు అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చాం. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రీఛార్జ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. మీకు రూ. 319 ధర ప్లాన్ ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

319 రీఛార్జ్ ప్లాన్

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన, నంబర్ వన్ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు చౌకైన ప్లాన్‌లను అందిస్తుంది. నిజానికి జియో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అందులో ఒకటి జియో రూ.319 ప్లాన్. ఇది వినియోగదారులకు మొబైల్ లేదా టీవీ యాక్సెస్ జియోహాట్‌స్టార్ సౌకర్యాన్ని 90 రోజులు ఉచితంగా అందిస్తుంది. 

ఇది కూడా చూడండి: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

అంతేకాకుండా రిలయన్స్ జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌లో OTT ప్రయోజనాలను అందించడమే కాకుండా.. కాలింగ్, డేటాను కూడా అందిస్తుంది. జియో రూ. 319 రీఛార్జ్ ప్లాన్ నెలరోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ నెల రోజులూ అపరిమిత కాల్స్ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు.. రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 ఉచిత SMS సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటా సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. 

ఇది కూడా చూడండి: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

 

latest-telugu-news | JioHotstar | jio-recharge-plans | jio recharge offers | today-news-in-telugu | business news telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amazon Great Summer Sale: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

New Update
Amazon great summer sale

Amazon great summer sale

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. వచ్చే నెల మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

5 శాతం వరకు డిస్కౌంట్..

ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లుకు 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది. దీంతో పాటు క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై కూడా డిస్కౌంట్‌ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అయితే 5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. వీటితో పాటు క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్స్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ వంటివి కూడా ఈ సేల్ ద్వారా ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా.. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్‌లను ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా, ఐక్యూ నియో 10R, ఐఫోన్ 15, వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్, వన్ ప్లస్ 13ఆర్,  గెలాక్సీ ఎమ్ 35 5జీ, వన్ ప్లస్ నోర్డ్ 4, ఐక్యూ జెడ్ 10ఎక్స్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించనుంది. హెచ్‌పీ, లెనోవా వంటి వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు ఇతర వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. పొందగలుగుతారు, దీని వలన మీ కొనుగోళ్లు మరింత సరసమైనవిగా మారుతాయి.

 

mobiles | amazon-great-summer-sale | discounts | laptops

Advertisment
Advertisment
Advertisment