/rtv/media/media_files/2025/03/06/2JGyX6FbCV6qV7GcIgiX.jpg)
IPHONE 16 offers IPHONE 16 available on flipkart Big Saving Days Sale
ఐఫోన్ కొనుక్కోవాలని అనుకుంటున్నారా?.. కానీ అధిక ధర కారణంగా కాస్త ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ తాజాగా అదిరిపోయే సేల్ తీసుకొచ్చింది. ఈ సేల్‌లో IPHONE 16 పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్లు, ఇతర డిస్కౌంట్‌లతో ఐఫోన్ 16ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
IPHONE 16 offers
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తీసుకొచ్చింది. నేటి నుండి ఈ కొత్త సేల్ ప్రారంభమైంది. దీనిలో కంపెనీ ఐఫోన్‌లపై అతిపెద్ద డీల్‌లను అందిస్తోంది. ఈ సేల్ మార్చి 13 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అదే సమయంలో Apple iPhone 16 పై అతిపెద్ద డీల్ సాయంత్రం 7 గంటలకు అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చూడండి: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
ఈ డీల్‌లో కేవలం రూ.59,999కి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఇందులో అందించబడుతున్నాయి. దీంతో రూ.60 వేల కంటే తక్కువ ధరకు తాజా ఐఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే గత సంవత్సరం ఈ ఫోన్‌ను దాదాపు రూ.80 వేలకు లాంచ్ అయింది. ప్రస్తుత ఈ ఫోన్ రూ. 74,900కి లిస్ట్ అయింది. అయినప్పటికీ తాజా ఆఫర్‌లో భాగంగా సాయంత్రం ఫోన్‌లో భారీ ధర తగ్గుదల కనిపిస్తుంది. ఇప్పటివరకు జరిగిన అత్యంత హాటెస్ట్ డీల్ ఇదేనని కంపెనీ పేర్కొంది.
ఇతర ఆఫర్లు
ఇక సేల్ పేజీ ప్రకారం ఈ ఫోన్ పై HDFC బ్యాంక్ రూ. 4,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ గా రూ. 5,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో చాలా కాలంగా కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇప్పుడు దాన్ని కొనడానికి ఇదే సరైన సమయం.
ఇది కూడా చూడండి: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!