/rtv/media/media_files/2025/03/20/pMRIwyqnJsp5jGIq7QGG.jpg)
Hyundai Cars Photograph: (Hyundai Cars)
కార్లు కొనుగోల చేసే వారికి బిగ్ షాక్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. కార్ల ధరలను పెంచుతామని ఇప్పటికే మారుతి సుజుకీ, కియా ఇండియా, టాటా మోటార్స్ ప్రకటించాయి. తాజాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా కూడా ప్రకటించాయి. కార్ల తయారీ వ్యయం, ముడి సరకు ధరలు, నిర్వహణ ఖర్చులు బాగా పెరిగాయి. ఈ కారణంగానే కార్ల ధరలను మూడు శాతం వరకు పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తెలిపింది.
ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ
#HyundaiMotor announces up to 3% price hike for its vehicles effective April 2025.
— NDTV Profit (@NDTVProfitIndia) March 19, 2025
For the latest news and updates, visit: https://t.co/by4FF5o0Ew pic.twitter.com/PKHRBnLYs7
ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు
కార్లు 3 శాతం పెంచుతూ..
గరిష్టంగా 3 శాతం మాత్రమే పెంపు ఉంటుంది. ఇది కూడా ఒక్కో మోడల్‌ను బట్టి ఉంటుందని తెలిపింది. అయితే ఈ ఏడాదిలో రెండోసారి వాహనాల ధరలను పెంచతారు. జనవరిలో రూ.25 వేల వరకు కొన్ని వాహనాలకు పెంచారు. ఇప్పటు మళ్లీ 3 శాతం పెంచనున్నారు. అయితే హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలుపుతూ.. వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...
భవిష్యత్తులో వినియోగదారులపై తక్కువగా ప్రభావం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో హ్యూండాయ్ కార్లు ఎక్కువగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో ఈ బ్రాండ్ గ్రాండ్ i10, ఎక్స్టర్, వెన్యూ, క్రెటా, ఆల్కజార్, టక్సన్, ఐయోనిక్ 5 వంటి మోడళ్లు ఉన్నాయి. ఇకపై కొత్తగా వచ్చే కార్ల ధరలు కూడా పెరగనున్నాయి.