/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Rupee-vs-Dollar-jpg.webp)
Dollar, Rupee
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు అని ఒక సామెత. అమెరికాకు ఎదో మంచి చేద్దామని అధ్యక్షుడు ట్రంప్ తలిస్తే జరుగుతున్నది మాత్రం మరొకలా ఉంది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఆ దేశానికే చేటు చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న యూఎస్ ఇప్పుడు ట్రంప్ టారీఫ్ ల నిర్ణయంతో మరింత దిగజారిపోయింది. గత కొన్ని రోజులుగా డాలర్ పతనమౌతూనే ఉంది. 90 రోజుల టారీఫ్ వాయిదా నిర్ణయం కూడా డాలర్ పతనాన్ని ఆపలేకపోయింది. దీనికి కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు నమ్మకం తగ్గుతుండడమే కారణమని చెబుతున్నారు.
మామూలుగా అయితే గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ అస్థిరతలో ఉంటే డాలర్ వాల్యూ పెరగాలి. కానీ అందుకు విరుద్ధంగా గత వారం రోజులుగా దాని విలువ పడిపోతోంది. మరోవైపు స్విస్ ఫ్రాంక్ విలువ డాలర్ మారకంలో 10 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అలాగే జపనీస్ యెన్, యూరో విలువ కూడా పెరిగాయి. యూరో మారకంలో డాలర్ విలువ శుక్రవారం ఒకటిన్నర శాతం పడగా, బ్రిటన్ పౌండ్ మారకంలో ఒక శాతం పడింది. గత 12 నెల్లో ఇంత వేగంగా డాలర్ వాల్యూ పడడం ఇదే మొదటిసారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లాంగ్ టెర్మ్ యూఎస్ ట్రెజరీలను కూడా ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో అమ్మేస్తున్నారు.
రూపాయి వాల్యూ..
ఇక రూపాయి వాల్యూ విషయానికి వస్తే డాలర్ మారకంతో పోలిస్తే 61 పైసలు బలపడి 86.07 దగ్గర ఉంది. డాలర్ క్షీణిస్తుండడం, చమురు ధరలు తగ్గడంతో త్వరలో రూపాయి మరింత బలపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇండియాపై 26 శాతం టారిఫ్ రేటును జులై 9 వరకు వాయిదా వేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించడం కూడా రూపాయి బలపడ్డానికి కారణంగా నిలిచింది.
today-latest-news-in-telugu | us-dollar | rupee | foriegn-investers
Also Read: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు