Best Camera Phones: చీపెస్ట్ 108MP కెమెరా స్మార్ట్‌ఫోన్స్.. ఫొటోలు పిచ్చ క్లారిటీ!

అతి తక్కువ ధరలో హై క్వాలిటీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. హానర్ 200 లైట్ 5జీ, రెడ్‌మి నోట్ 13 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు 108mpకెమెరాను కలిగి ఉన్నాయి. వీటి ధరలు కూడా రూ.20 వేల లోపే ఉండటం గమనార్హం. బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు.

New Update
HONOR 200 Lite 5G

HONOR 200 Lite 5G.

భారత దేశంలో స్మార్ట్‌ఫోన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో కొత్త కొత్త కంపెనీలు సైతం దేశీయ మార్కెట్‌లో తమ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు అధునాతన టెక్నాలజీని తమ ఫోన్లలో అందిస్తున్నాయి. 

అదే సమయంలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లలో మార్పులు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ వినియోగదారులు బెస్ట్ కెమెరా క్వాలిటీ మొబైల్స్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వాటిపైనే తయారీ కంపెనీలు ఫోకస్ పెట్టి హై రేటెడ్ క్వాలిటీ సెన్సార్‌లను తమ ఫోన్లలో అందిస్తూ వస్తున్నాయి. 

Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ

మరి మీరు కూడా మంచి కెమెరా క్వాలిటీ గల ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే 108MP కెమెరా క్వాలిటీతో అందుబాటులో పలు ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. అవి చాలా తక్కువ ధరలో ఉండటమే కాకుండా.. బ్యాంక్, ఇతర డిస్కౌంట్‌లు పొందవచ్చు. అందులో..

HONOR 200 Lite 5G

HONOR 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ భారీ కెమెరాను కలిగి ఉంది. ఇది 108MP ప్రధాన కెమెరా, 5MP వైడ్&డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. కెమెరా అద్భుతమైన ఫోటోగ్రఫీ విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,998గా ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1000 తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. దీని కెమెరా ఆటో సీన్ రికగ్నిషన్, ఇమేజ్ ఆప్టిమైజేషన్, AI-సపోర్టెడ్ ఇన్‌స్టంట్ మూవీ మేకర్, వైడ్ యాంగిల్స్‌కు AI-సపోర్టెడ్ ఆటో-అడ్జస్టింగ్ వంటి ఫీచర్‌లతో వస్తుంది.

Redmi Note 13 5G

Also Read : దెయ్యంగా మారనున్న బుట్టబొమ్మ.. భయపెడుతుందా?

Redmi Note 13 5G స్మార్ట్‌ఫోన్‌ సైతం భారీ కెమెరా క్వాలిటీతో వస్తుంది. ఇందుల 108MP 3X ఇన్-సెన్సర్ జూమ్ AI ట్రిపుల్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీని 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.15,162కి అందుబాటులో ఉంది. దీని కెమెరా డెప్త్ కంట్రోల్, మాక్రో, ప్రో మోడ్, డాక్యుమెంట్ స్కానర్, పనోరమా, హెచ్‌డిఆర్, గూగుల్ లెన్స్ బిల్ట్-ఇన్, వాయిస్ షట్టర్‌తో AI పోర్ట్రెయిట్ మోడ్‌తో వస్తుంది.

OnePlus Nord CE 3 Lite 5G

OnePlus Nord CE 3 Lite 5G కూడా 108 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. అలాగే 2MP డెప్త్-అసిస్ట్ లెన్స్, 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. ఇంకా 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3x లాస్‌లెస్ జూమ్, ఫోటో, వీడియో, నైట్‌స్కేప్, ఎక్స్‌పర్ట్, పనోరమిక్, పోర్ట్రెయిట్, మాక్రో, టైమ్-లాప్స్, స్లో-మోషన్, లాంగ్ ఎక్స్‌పోజర్, డ్యూయల్ వ్యూ వీడియో, టెక్స్ట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,380గా ఉంది.

Also Read:'అన్ స్టాపబుల్' సెట్స్ లో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియోలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు