/rtv/media/media_files/2025/03/03/gcQKj7ZxK0meBzvSxnTV.jpg)
bira logo Photograph: (bira logo )
మార్పు మంచిదేనని అంటుంటారు.. కానీ, ఇక్కడ చిన్న మార్పు చేసినందుకు కొన్ని కోట్లు నష్టపోయింది ఓ బీర్ కంపెనీ. బిజినెస్ పెంచుదామనుకున్న కంపెనీకి అసలుకే మోసం వచ్చింది. బీరా పేరు వినే ఉంటారు. ఇది భారతదేశంలో అత్యంత వేగంగా పాపులర్ అవుతున్న క్రాఫ్ట్ బీర్. దీనిని 2015లో అంకుర్ జైన్ స్థాపించారు. అయితే, ఈ బీర్ బ్రాండ్ పేరులో చిన్న మార్పు చేసినందుకు రూ.80 కోట్ల లాస్ వచ్చింది.
Also read: SLBC tunnel: టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
2026 ప్రారంభంలో B9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విస్తరణ కోసం IPOకి వెళ్లనుంది. యాజమాన్యం అందుకు అనుగుణంగా ఈ బీరు కంపెనీ పేరు, లోగోలో చిన్న మార్పు చేసింది. B9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును B9 బెవరేజెస్ లిమిటెడ్‌గా మార్చింది. అలాగే లోగోలో చిన్న ఛేంజ్ చేసి బిరా పక్కన 91ని చేర్చారు.
In 2009, Cerana entered India importing beers.
— Parsh Kothari (@parsh_kothari) October 20, 2024
Everyone thought it would FAIL to sell its 'premium' beers in Kingfishers and Carlsberg's INDIA.
But to their shock, Bira went on to sell 12 MILLION cases every year.
Here's the story of Bira91 (and can it be the next Blinkit?) pic.twitter.com/rvBsvB8h6I
ఇది పెద్దగా మార్పు కాదు.. కానీ, ఈ చిన్న మార్పు కోట్ల నష్టానికి కారణమైంది. కంపెనీ తన కొత్త ప్రాడక్ట్ లేబుల్ రిజిస్ట్రేషన్‌ను కోసం రూ. 80 కోట్ల ఇన్వెంటరీని రద్దు చేయాల్సి వచ్చింది. దీని కారణంగా చాలా 6 నెలల పాటు అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఆ చిన్న మార్పే కంపెనీకి రూ.80 కోట్లు నష్టాన్ని తీసుకొచ్చింది. బీరా బీర్ల సేల్స్ 22 శాతం తగ్గాయి.
Also read : World Wildlife Day: గుజరాత్‌లో అడవిబాట పట్టిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?