/rtv/media/media_files/2025/01/22/75VMKwfx7TwzbCSKrvKR.jpg)
Blinkit Photograph: (Blinkit)
జొమాటోకు చెందిన క్విక్‌కామర్స్ సంస్థ బ్లింకిట్ చాలా వస్తువులను డెలవరీ చేస్తోంది. మామూలు గ్రోసరీతో పాటూ టెక్నాలజీకి సంబంధించిన ఉత్పత్తులను కూడా డెలివరీ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా వివిధ రకాల యాపిల్ ఉత్పత్తులను ఎంపిక చేసిన నగరాల్లో కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయనుంది. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్, ఐపాడ్స్, ఇతర యాక్సెసరీలను క్షణాల్లో అందిస్తామని కంపెనీ సీఈఓ అల్బీందర్ దిండ్సా చెప్పారు. దీనికి సంబంధించి ఎక్స్ లో సీఈవో పోస్ట్ పెట్టారు. ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబయి, హైదరాబాద్, పుణె, లఖ్‌నవూ, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఈ సేవలు లభిస్తాయని దిండ్సా తెలిపారు. ఇప్పటికే యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్లను ఎంపిక చేసిన నగరాల్లో బ్లింకిట్ అందిస్తోంది.
ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే..
ఇంతకు ముందే స్మార్ట్ ఫోన్ల డెలివరీలను మొదలెట్టిన బ్లింకిట్ యాపిల్ ఉత్పత్తుల డెలివరీని కూడా మొదలుపెట్టింది. ఏ వస్తువును ఆర్డర్ చేసినా కూడా కేవలం పది నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. వీటిని కూడా ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో డెలివరీ చేసేందుకు బ్లింకిట్ సిద్ధమవుతోంది. దీని కోసం కొన్ని టెక్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. షియోమి, నోకియా వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ కొత్త సర్వీసును బ్లింకిట్ ఫస్ట్ మెట్రో నగరాలు అయిన బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో అందుబాటులోకి తీసుకొచ్చింది. పాపులర్ ఫోన్లను ఇందులో ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తోంది. ఈ ఫోన్లకు కంపెనీ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. వీటితో పాటు ఇంకా పాపులర్ బ్రాండ్ ఫోన్లు తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. అయితే కేవలం మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా.. ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు వంటివి కూడా డెలివరీ చేస్తోంది.
Also Read: HYD: హైదరాబాద్ యూనివర్శిటీ ఘోర ప్రమాదం..కుప్పకూలిన నిర్మాణం