Lay Off: ఒకేసారి 99 మంది ఉద్యోగులను తీసేసిన CEO.. కారణం తెలిస్తే షాకే!

అమెరికా మ్యూజిక్ కంపెనీ సీఈఓ బాల్డ్విన్ నిర్వహించిన మీటింగ్‌కు హాజరు కాలేదని 99 మంది ఉద్యోగులపై వేటు వేశారు. కంపెనీలో మొత్తం 111 మంది ఉండగా.. మీటింగ్‌కి హాజరు కాని వారికి ఉద్యోగంపై సీరియస్‌నెస్ లేదని తీసేశారు.

New Update
Layoffs: మస్తు పనిచేసిండ్రు..ఇక ఇంటికి పోండి..ఐటీ కంపెనీ నిర్ణయం..!

సీఈవో నిర్వహించిన ఓ మీటింగ్‌కు ఎంప్లాయిస్ హాజరు కాలేదని ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీ ఉద్యోగులు అందరికి ఓ సమావేశం నిర్వహించింది. మొత్తం 111 మంది ఎంప్లాయిస్ ఉండగా అందులో కొందరు మాత్రమే హాజరయ్యారు. దీంతో హాజరుకాని వారిని సీఈఓ బాల్డ్విన్ ఉద్యోగం నుంచి తొలగించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

సమావేశానికి హాజరు కానీ 99 మందిపై..

మీటింగ్‌కి హాజరు కానీ ఒక పది మందిపై వేటు వేశారని అనుకుంటే పొరబాటే. 111 మంది ఉన్న ఎంప్లాయిస్‌లో 99 మందిపై వేటు వేశారు. ఉద్యోగాన్ని సీరియస్‌గా తీసుకోలేదని, సీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఉద్యోగులు చేయాల్సిన పనిలో విఫలమయ్యారు.. కనీసం సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగంలో నుంచి తీసేశారు.

ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత

సంస్థకి సంబంధించిన అన్ని ఖాతాలను సైన్ ఔట్ చేయడంతో పాటు వస్తువులను తిరిగి ఇచ్చేయాలన్నారు. సమావేశానికి హాజరైన వారిని ఉద్యోగంలో ఉంచి మిగతా వారిని తీసేశారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేసే ఒక ఇంటర్న్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు

సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో.. దీనికి కొందరు నెటిజన్లు స్పందించారు. మీటింగ్ అంటే ఎవరో పది మంది హాజరు కాకపోవచ్చు.. మరీ 99 మంది సమావేశానికి హాజరు కాకుండా ఉండరు కదా. ఆఫీస్ యాజమాన్యం కావాలనే అలా చేసిందని అంటున్నారు. మరికొందరు ఆఫీస్‌లో రాజకీయాలు జరుగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే జరిగిందా? లేకపోతే కంపెనీ అలా క్రియేట్ చేసిందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు