/rtv/media/media_files/2024/11/21/rklsqw4185KQv72wQgTk.jpg)
గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీలు ఇద్దురు భారతీయ కుభేరులు.. వీళ్ల బిజినెస్ అన్ని రంగాల్లో విస్తరించారు. తరతరాలు కుర్చొని తిన్న తరగని ఆస్తి, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు అంబానీ, అదానీలు. అయితే వీళ్ల ఇంట్లో సెలబ్రేషన్ జరిగినా అంతే ఎత్తున హంగామా ఉంటుంది. ప్రపంచ ప్రముఖులతో డ్యాన్స్ షోలు, ఈవెంట్స్, ఖరీదైన వంటాకాలు, బహుమతులు ఇలాంటి ధనికుల ఇంట్లో పెళ్లిల్లు, పేరంటాకు కనిపిస్తుంటాయి. ఆరు నెలల క్రితమే ముకేశ్ అంబానీ చిన్న కొడుకు ఆనంత్ అంబానీ పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. దాదాపు 5వేల కోట్లు ఖర్చు చేసి గ్రాండ్‌గా ముకేశ్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి చేశాడు. పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, కూతురు ఇశా అంబానీల పెళ్లి కూడా చాలా గ్రాండ్‌గానే చేశారు.
ఇండియన్ మరో బిలియనీర్ గౌతమ్ అదానీకి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. గౌతమ్ అదానీ మొత్తం ఆస్తుల విలువ 8.3 ట్రిలియన్ (ఒక ట్రిలియన్ అంటే వెయ్యి మిలియన్స్) డాలర్స్ లో అయితే అదానీ ఆస్తుల విలువ 101.5 బిలియన్ డాలర్స్. పెద్ద కొడుకు కరన్ అదానీ పెళ్లి ఇప్పటికే అయిపోగా.. ఇప్పుడు చిన్న కొడుకు జీత్ అదానీ పెళ్లి చేస్తు్న్నారు. జీత్ అదానీతో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా షా ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరి పెళ్లి ఫిభ్రవరి 7న అమహ్మదాబాద్‌లో పెళ్లి జరగనుంది.
Also Read : Virat Kohli: జవాన్ సెల్ఫీకి నో చెప్పిన స్టార్ క్రికెటర్.. మండిపడుతున్న నెటిజన్లు
గత సంవత్సరం ముకేశ్ అంబానీ చేసినట్లుగానే అట్టహాసంగా పెళ్లి వేడుకలు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. అయితే.. గౌతమ్ అదానీ మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తన చిన్న కొడుకు పెళ్లి చేస్తానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. జనవరి 21న ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో గౌతమ్ అదానీ కుటుంబం సమేతంగా హాజరైయ్యాడు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 7న తన కుమారుడి వివాహాన్ని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. పూర్తిగా హిందూ సంప్రదాయ ఆచారాలతో ఎలాంటి హర్భాటాలు లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని చెప్పారు. ఆయన వెంట ఆయన భార్య ప్రీతి అదానీ, కుమారులు కరణ్, జీత్, కోడలు పరిధి, మనవరాలు కావేరి ఉన్నారు.
Read also: ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
అదానీ ఇంట్లో జీత్ అదానీ మ్యారేజ్ చివరిది ఈ వేడుకలు అత్యంత గ్రాండ్‌గా చేస్తారని అందరూ ఊహించారు. కానీ ఆయన తన చిన్న కొడుకు మ్యారేజ్ సింపుల్‌గా చేస్తానని చెప్పారు. సాధారణంగా కొడుకు పెళ్లి చేసిన తానేమి అత్యంత ధనవంతుడిని కాదని చెప్పుకోవడానికే అదానీ అలా చెబుతున్నాడని కొందరు అనుకుంటున్నారు. ముకేశ్ అంబానీ మాత్రం వరల్డ్ సెలబ్రెటీలను పిలిచి.. ఇండియా ప్రధాని కూడా ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లారు. అంత వైభవంగా ఆ పెళ్లి చేశారు. ముకేశ్ అంబానీ సంపద విలువ 9.10 లక్షల కోట్లు ఇది అదానీ ఆస్తుల కంటే తక్కువే. అయినా సరే అదానీ సింపుల్‌గా ట్రెడిషనల్‌గా తన చిన్న కొడుకు పెళ్లి చేస్తానని చెప్పారు. ఈ పెళ్లికి సెలబ్రెటీలను కూడా ఆహ్వానించనని ఆయన అన్నారు.
పెద్ద కొడుకు పెళ్లి కూడా అదానీ సాధారణంగా చేశారు. యూఎస్‌లో గౌతమ్ అదానీపై సోలర్ ఎనర్జీ కాంట్రాక్ట్‌లో అవినీతి ఆరోపణ కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతేకాదు మోదీ, అదానీ అవినీతిలో భాగమని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇండియాలో పేదవాళ్లను దోచి అంబానీ, అదానీలకు సంపద పంచి పెడుతున్నారని కూడా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. మరి అదానీ మాత్రం తన చిన్న కొడుకు జీత్ పెళ్లి సింపుల్‌గా ఎందుకు చేస్తానని అంటున్నాడో అని చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి.