చాలా రోజుల తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్లో జోరందుకున్నాయి. నిన్నంతా ట్రేడింగ్‌లో అదానీ కంపెనీల షేర్లు ర్యాలీ చేశాయి. ఈ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ మునుపటి సెషన్‌లో కంటే భారీ కరెక్షన్ తర్వాత 8.8% పెరిగింది. దీంతో ఇంట్రాడేలో స్టాక్స్ వాల్యూ గరిష్ట స్థాయి రూ.2,422.90కి చేరుకుంది. ఆ తరువాత ఇది మరింత పెరిగి 19.2 శాతానికి చేరుకుంది. అప్పుడు స్టాక్స్ వాల్యూ రూ.5, 362కి వెళ్ళింది.
అదానీ కంపెనీలపై కేసు కొట్టివేత..
అదానీ స్టాక్స్ వాల్యూ ఒక్కసారిగా పెరిగాయి. దీనికి కారణం అమెరికాలో అతని కంపెనీల మీద కేసులను కొట్టివేయొచ్చనే వార్తలు రావడమే అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ట్రంప్ ప్రెసిడెంట్ పదవి చేపట్టాక లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీకి క్లీన్ చిట్ ఇస్తారని చెబుతున్నారు. దీంతో మార్కెట్‌లో ఒక్కసారిగా బజ్ వచ్చింది. ఇదే అదానీ గ్రూప్స్ షేర్లు ఒక్కసారిగా పెరగడానికి దోహదపడిందని తెలుస్తోంది.
నవంబర్ 21, 2024న స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ. 432కి చేరుకుంది. ఆ తరువాత కంపెనీ షేర్లు బలపడలేదు. నిన్న ఇవి కాస్త కోలుకున్నాయి. అయితే ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.895.85కి ఇంకా 67% దూరంలో ఉందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఇంట్రా-డేలో 14% పెరగ్గా..అదానీ గ్రీన్ ఎనర్జీ ఇంట్రా-డేలో 14% పెరిగింది. వీటితో పాటూ ACC , అదానీ పోర్ట్స్ , అదానీ టోటల్ గ్యాస్ , అదానీ విల్మార్, అంబుజా సిమెంట్ మొదలైన ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేవరకూ ఈ పరిస్థితి కొనసాగవచ్చని...తరువాత మాత్రం ఆయన పదవిలోకి వచ్చాక అదానీ కంపెనీల మీద తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
Also Read: Tibet: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..3600 సార్లు..