/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rajini-jpg.webp)
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 169వ సినిమా జైలర్ బంపర్ హిట్టు కొట్టింది. రజనీకి ఇది గ్రేట్ కంబ్యాక్. దీంతో 72 ఏళ్ళ రజనీ రెట్టించిన ఉత్సాహంతో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రజనీ కెరీర్ 170వ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. టి.జి. జ్ఞానవేల్ దీనిని డైరక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా పేరు ఇంకా ఖరారు చేయలేదు. కానీ మరో రెండు రోజుల్లో ఇది సెట్స్ మీదకు వెళ్ళనుంది. మరోవైపు తలైవర్ 170 గా పిలుచుకుంటున్న ఈ సినిమా కాన్వాస్ అనుకున్నదానికంటే పెద్దదవుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటూ తెలుగు, మలయాళ పెద్ద పెద్ద నటులు కూడా యాక్ట్ చేస్తున్నారు.
రజనీ 170వ సినిమా అంచనాలకు మించి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో కాస్టింగ్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. లైకా ప్రొడక్షన్‌లో వస్తున్ ఈ మూవీలో పాహద్ ఫాజిల్, రానాలు కూడా నటిస్తున్నారు. అలాగే రితికా సింగ్, దుషారా విజయన్, మంజూ వారియర్‌లు హీరోయిన్లుగా ఉన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడిగా నటించనున్నారు. భళ్ళాల దేవ రానా దగ్గుబాటి ఇందులో ఒక కీలక పాత్రలో నటించనుండగా, మంజు వారియర్ పాత్ర ఆసక్తిని కలిగిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కూడా అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 2024 లో విడుదల చేయాలనేది ప్లాన్.
ఇక దాదాపు 32 ఏళ్ళ తర్వాత రజనీకాంత్‌తో అమితాబ్ కలిసి నటిస్తున్నారు. వీరు చివరగా ముకుల్ ఎస్.ఆనంద్ తెరకెక్కించిన 'హమ్' చిత్రంలో కలిసి నటించారు. మరోవైపు తలైవర్ 170 ఒక కాప్ డ్రామా అని పుకార్లు ఉన్నాయి. ఇందులో రజనీ మరోసారి ఖాకీ అవతార్ లో కనిపిస్తారు. బూటకపు ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు ప్రారంభించే ముస్లిం పోలీసుగా కనిపిస్తాడని సమాచారం. నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందిస్తున్న చిత్రమని ప్రచారం జరుగుతోంది.
We are feeling honoured to announce our next association with “Superstar” @rajinikanth 🌟 for #Thalaivar170 🤗
Directed by critically acclaimed @tjgnan 🎬 Music by the sensational “Rockstar” @anirudhofficial 🎸
🤝 @gkmtamilkumaran
🪙 @LycaProductions #Subaskaran#தலைவர்170 🤗 pic.twitter.com/DYg3aSeAi5— Lyca Productions (@LycaProductions) March 2, 2023
Superstar #Rajinikanth today:
"#Thalaivar170 will be a grand entertainer with a good message."
"The title of my 170th film will be announced soon."
"I am… pic.twitter.com/RyovINkVWC
— Manobala Vijayabalan (@ManobalaV) October 3, 2023
also read:ప్లీజ్ దయచేసి నన్ను అడగొద్దు…విరాట్ కోహ్లీ ఇన్స్టా పోస్ట్