USA: అమెరికాలోని జార్జియాలో కాల్పులు..నలుగురు మృతి అమెరికాలోని జార్జియాలో ఒక స్కూల్లో ఒక దుండుగుడు కాల్పులు జరిపాడు. ఇందులో నలుగురు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడికి కేవలం 14 ఏళ్ళు. By Manogna alamuru 05 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Shooting In School: అమెరికాలో కాల్పులు కొత్తేమీ కాదు. అక్కడ తుపాకీని ధరించడం చట్టబద్ధం కావడంతో చాలా మందికి అది అందుబాటులో ఉంటుంది. దీన్ని అలుసుగా తీసుకుని అమెరికాలో చాలా మంది దాడులు చేస్తుంటారు. తాజాగా ఈరోజు జార్జియాలో జీబీఐ హైస్కూల్లో ఒక పధ్నాలుగేళ్ళ పిల్లవాడు కాల్పులు జరిపాడు. ఈ పాఠశాల రాష్ట్ర రాజధాని అట్లాంటాకు ఈశాన్యంగా 45 మైళ్లు (70 కిలోమీటర్లు) దూరంలో ఉన్న విండర్ పట్టణంలో ఉంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే గాయపడిన వారివి అన్నీ తుపాకుల గాయాలు కావని..అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో తగిలిన దెబ్బలని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కాల్పులు జరిగిన వెంటనే స్కూలు నుంచి విద్యార్ధులను ఇంటికి పంపించేశారు. సంఘటన జరిగిన వెంటనే స్కూలుకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ టీనేజర్ ఎందుకు కాల్పులు చేశాడు...అతను ఆ స్కూల్లో చదివాడా అన్న వివరాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం స్కూల్‌ను మూసివేయడమే కాక..జార్జియాలోని బారో కౌంటీని లాక్ డౌన్ చేశారు. #HappeningNow shooting at Apalachee High School in Barrow Co. GA. Hearing reports of injuries. pic.twitter.com/t4xgv8Ibaq — DAP (insert blue check here) (@Deetroit_Dave) September 4, 2024 Also Read: Telangana Farmers: రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఫ్రీగా సోలార్ పంపుసెట్లు! #school #usa #america #shooting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి