/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-4-15-jpg.webp)
Telangana:వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ.37,870 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. రేవంత్ రెడ్డి ఇంకా స్విట్జర్లాండ్‌లోనే ఉన్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు చర్చలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఈ పెట్టుబడులు అన్నీ వచ్చాయి.
Also Read:మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా? హైకోర్టులో దాఖలైన పిల్
12,400 కోట్లతో అదానీ పెట్టుబడులు...
అదానీ లాంటి కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో పాటూ జేఎస్‌డబ్ల్యూ, గోడి, వెబ్ వెర్క్స్, గోద్రెజ్, ఆరాజెన్ వంటి పలు దిగ్గజ సంస్థలు పెట్టబుడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ సంస్థల ప్రతినిధులు రేవంత్ రెడ్డి సర్కారుతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. అందరి కంటే అత్యధికంగా అదానీ గ్రూప్స్ 12, 400 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా 1350 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు చేయనుంది. దీని కోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో పాటూ చందన్‌వెల్లిలో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్లు 5 వేల కోట్లతో ఏర్పాటు చేయనుంది. మరోవైపు రూ. 1400 కోట్ల పెట్టుబడితో అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 MTPA సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్, అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్ దగ్గర కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి కేంద్రాలకు రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
Chief Minister Sri @revanth_anumula, along with Industries Minister Sri @Min_SridharBabu, met with Sri @gautam_adani, Chairman @AdaniOnline on the sidelines of @wef's 54th Annual Meeting in #Davos.
The hour-long meeting covered a plethora of exciting new business opportunities… pic.twitter.com/9JfclrKnnL
— Telangana CMO (@TelanganaCMO) January 16, 2024
పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన బడా కంపెనీలు...
జేఎస్‌డబ్ల్యూ 9 వేల కోట్ల రూపాయలతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. అలాగే గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘గిగా స్కేల్ బ్యాటరీ సెల్’ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో నెలకొల్పుతామని చెప్పింది. దీని కోసం రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. డేటా కేంద్రాల నిర్వహణలో టాప్ కంపెనీ అయిన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్ వర్క్స్ తెలంగాణలో రూ.5,200 కోట్ల పెట్టనుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటూ ఆరాజెన్ లైఫ్‌సైన్సెస్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించింది. రూ.2 వేల కోట్లతో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి చేసేందుకు రెడీ అయ్యింది.