Andhra Pradesh: ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊరట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా..దానిపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

New Update
Pawan Kalyan : యువతకు పవన్ సీరియస్ వార్నింగ్.. అలాంటి పనులు చేస్తే వాతలే!

Deputy CM Pawan Kalyan: వాలంటీర్లలపై అనుచిత వ్యాఖ్యలు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. గుంటూరులో వాలంటీర్లపై వన్ చేసిన వాఖ్యలకు ఆయన మీద కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్.. తదుపరి విచారణ 4 వారాలకి వాయిదా వేస్తునట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది.

మరోవైపు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పరిధిలో ఉన్న శాఖల పని తీరును మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సమావేశం అయ్యారు. లార్సన్ టీమ్ ను ఆయన సత్కరించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురి మధ్య ప్రత్యేక చర్చ కొనసాగింది.. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే యువతకు సహకారం ఇవ్వాలని పవన్ కోరారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారు.. వారి ప్రతిభకు తగిన ఛాన్సులు అందించడంలోనూ, మార్గనిర్దేశనం చేయాలని కోరారు. పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

Also Read:USA: ట్రంప్‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌నున్న ఎఫ్‌బీఐ

Advertisment
Advertisment
తాజా కథనాలు