Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం! కొండగట్టుకు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రానున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకునేందుకు పవన్ కొండగట్టుకు రాబోతున్నారు. By Bhavana 28 Jun 2024 in విజయవాడ తెలంగాణ New Update షేర్ చేయండి Pawan Kalyan: కొండగట్టుకు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రానున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకునేందుకు పవన్ కొండగట్టుకు రాబోతున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా జనసేన అధినేత భావిస్తూంటారు. వారాహి యాత్రకి ముందు ఆయన వాహనానికి తొలిపూజ కూడా కొండగట్టులోనే పవన్ చేశారు. అంతేకాకుండా ఎన్డీయే కూటమి పొత్తులను కూడా పవన్ ఇక్కడే ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం పవన్ సెక్యూరిటీ అధికారులు కొండగట్టుకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు చేరుకుంటారు. జేఎన్టీయూలో హెలీప్యాడ్ అందుబాటులో లేకపోవడంతో పవన్ స్పెషల్ అడ్వైజర్ కల్నల్ అర్జున్ రూట్ మ్యాప్, పర్యటన్ ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కు భారీగా స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. Also read: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం! #pawan-kalyan #deputy-cm #ap #janasena #politics #temple #hanuman #kondagattu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి