YCP :మార్చి-ఏప్రిల్లో ఎన్నికలు, ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫెస్టో ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. మార్చి ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని చెప్పారు ఆ పార్టీ అధినేత జగన్. అక్టోబర్ 25 నుంచి 31వ తేదీ వరకు ఏపీ సీఎం జగనన్న బస్సు యాత్ర ఉంటుందని ప్రకటించారు. దాంతో పాటూ జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమాలను ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. By Manogna alamuru 09 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని వైసీపీ అధిపతి జగన్ కన్ఫార్మ చేశారు. దానికి తగ్గట్టు ఫ్రిబ్రవరిలో మేనిఫెస్టో వస్తుందని తెలిపారు. వైఎస్సార్సీపీలో కార్యకర్తలు, నేతలందరూ ఎన్నికల కోసం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 25 నుండి 31తారీకు వరకు బస్సుయాత్ర చేయాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మార్చి ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని...ఆ లోపల నాలుగు కీలక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది.జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలను ప్రకటించింది. వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశాల్లో ఈనిర్ణయాలను జగన్ ప్రకటించారు. బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలుంటారు. ప్రతీరోజు మూడు మీటింగులు జరుగుతాయి. ఇది కేవలం బస్సు యాత్రే కాదు సామాజిక న్యాయయాత్ర అని చెప్పారు జగన్. వైసీపీ ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం, సాధికారత గురించి ప్రజలకు చెప్పాలని...పేదవారికి జరిగిన మంచి గురించి చెప్పాలన్నారు. రాబోయే కాలంలో పేదవాడికి, పెత్తందార్లకు జరగబోయే యుద్ధంలో గెలవాలంటే పేదవారంతా ఏకం కావాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశంలో వైసీపీ మాత్రమే అన్నారు జగన్. వైసీపీ ఇచ్చినంతగా వేరే ఏ పార్టీ ఇంతలా సంక్షేమం ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటి వరకు చాలా అడుగులు వేసామని అయితే రాబోయే రోజులు మరింత కీలకమని, ఎలక్షన్స్ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్ సూచించారు. బహుశా వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ ఎన్నికలు జరుగుతాయని అన్నారు జగన్. జగనన్న ఆరోగ్య సురక్ష ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని జగన్ పిలుపునిచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలో ఏ ఒక్కరు అనారోగ్య సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. వ్యాధులు రాకముందే ప్రజలను అప్రమత్తం చేయడం, తగిన మందులు ఇవ్వడం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. 5 దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఇందులో 15వేల హెల్త్ క్యాంపుల ద్వారా కోటి 65 లక్షల ఇళ్ళను కవర్ చేస్తామని తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే ఎందుకు రావాలనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఏపీ ముఖ్యమంత్రా జగన్ సూచించారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే ప్రోగ్రాం ద్వారా గ్రామస్థాయిలో కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన మంచి గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. 2019లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని వివరించారు జగన్. జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు అమలు చేస్తామని చెప్పారు జగన్. ఇచ్చిన మాట ప్రకారం 3వేల రూపాయలను ఇస్తాయని...ముసలివాళ్ళకు, వితంతువులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. జనవరి 10 నుంచి 20 వరకు వైఎస్సార్ చేయూత ద్వారా 19వేల కోట్ల అందిస్తాయని తెలిపారు. అలాగే డిసెంబర్ 11 నుంచి ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దీనిలో గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకురులను గుర్తిస్తామని తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచివారు రాష్ట్రస్థాయి టోర్నమెంటులో పాల్గొంటారు. భారత టీమ్‌లలో వై నాట్ ఏపీ పరిస్థితి రావాలని జగన్ అన్నారు. జనవరి 15వరకు ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరం ఉంటుందని తెలిపారు. #ycp #jagan #ap #elections #cm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి