/rtv/media/media_files/2025/03/06/XGn0gDdl5OvpCtHLsjSm.jpg)
ambati rambabu tweet Photograph: (ambati rambabu tweet)
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో జనసేనా పార్టీ అభ్యర్థిగా కొణిదల నాగబాబును ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఆయన నామినేషన్ కూడా వేయనున్నారు. గతంలో నాగబాబుకు మంత్రి పదవి ఖాయం అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈక్రమంలో ఆయనకు MLA కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడం చర్చనీయంగా మారింది. నాగబాబు మినిస్టర్ అవ్వడానికి లైన్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నారు. నాగబాబును MLC గా ప్రకటించడంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!@NagaBabuOffl @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) March 6, 2025
అడ్డదారిలో అన్నని మంత్రి చేయడానికే జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబుకి MLC పదవి ఇచ్చారని ఆయన ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్‌ను టార్గెట్‌గా చేస్తూ.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
Also read: Ap news: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు నుజ్జు నుజ్జు
అటు కూటమి ప్రభుత్వం నాగబాబుకు మంత్రి పదవిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీతో నాగబాబుని ఆపేస్తారా? లేక మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నాగబాబు మంత్రి అయితే అన్నదమ్ములిద్దరూ మంత్రులుగా ఉన్న ఏకైక సభగా ఇది గుర్తింపు పొందనుందా.. అనే చర్చ జరుగుతోంది.
ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఒకే ప్రభుత్వంలో మంత్రులుగా ఉండటం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇక గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో 25 మంది మంత్రులు కొనసాగగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులే ఉన్నారు. ఖాళీగా ఉన్న ఆ ఒక్క మంత్రి పదవిని బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కానుండటంతో ఆ అవకాశం బీజేపీదా, జనసేనదా అనే చర్చ మొదలైంది.