/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rapido-jpg.webp)
హైదరాబాద్ లో ఓలా, ఊబర్, ర్యాపిడోలను వాడని వాళ్ళు ఉండరు. చాలా మంది డ్రైవింగ్ స్ట్రేస్ నుంచి ఫ్రీగా ఉండడం కోసం వీటిని ఎక్కువగా వాడుతుంటారు. చాలామంది ర్యాపిడూ బైక్ లను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇవి అయితే కార్ల కన్నా కన్నా తొందరగా గమ్యస్థానాలకు చేరుకుంటారు, చవక కూడా అనే ఉద్దేశంతో. అయితే వీటిని నడిపేది ఎక్కువగా పురుషులే ఉంటారు. కొన్ని రోజుల క్రితమం మహిళా డ్రైవర్లు కూడా చేరవచ్చును చెప్పినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఇదే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని డిసైడ్ అయింది అక్కడ ప్రభుత్వం. మహిళలు ఇబ్బంది పడకుండా లేడీ డ్రైవర్లను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది.
ర్యాపిడోతో ఒప్పందం..
స్త్రీల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకుంది. అదే కాకుండా స్వయం సహాయ సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు సమకూర్చనుంది ఏపీ ప్రభుత్వం. దీని ద్వారా మహిళల ప్రయాణాలు సుఖవంతం అవుతాయని అంటోంది. అంతేకాదు మహిళలకు ఉపాధి ఊతం కూడా లభిస్తుందని చెబుతోంది. ఈ కార్యక్రమం కింద విశాఖపట్నం, విజయవాడల్లో 400 చొప్పున ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు కేటాయించనున్నారు. మరో 200 వాహనాలను రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో అందజేయనున్నారు. అలాగే ముద్ర, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా సంఘాల సభ్యులకు అప్పులు ఇచ్చి, వాహనాలు కొనుగోలు చేసేలా చేస్తామని తెలిపింది. ర్యాపిడో సంస్థతో చేసుకుంటున్న ఒప్పందం ప్రకారం మొదటి మూడు నెలలూ బళ్ళు నడిపేవారు ఆ సంస్థకు ప్లాట్‌ఫాం ఛార్జీలు ఇవ్వనక్కర్లేదు. ఆ తర్వాతి నుంచి నెలకు రూ.వెయ్యి కడితే సరిపోతుంది. ఒక్కోవెహికల్ కూ నెలకు 300 బుకింగ్‌లు ఇచ్చే విధంగా ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం.