Ap Rains:ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో పిడుగులు, అతి భారీ వర్షాలు!
ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో విషాదం జరిగింది. రెండు రోజుల క్రితం కట్టుకున్న భర్త, ఇద్దరు కుమారులు పోలవరం కుడి కాలువలో పడి చనిపోయారు. దీంతో రెండు రోజులుగా ఎక్కిఎక్కి ఏడ్చిన భార్య తీవ్ర మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
AP: పిఠాపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై పవన కళ్యాణ్ స్పందించారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు
AP: మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ నెల 11 వరకు దరఖాస్తులకు సమయాన్ని పొడిగించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మద్యం షాపులకు దరఖాస్తులు చేయొద్దంటూ కొందరు ఎమ్మెల్యేలు వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. దీంతో నష్ట నివారణకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నరనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.నడక మార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన..తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.అతిథి గృహంలోనే వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు.
తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సీఐడీ విజయపాల్, డాక్టర్ ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని కోరారు.