ఏపీ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్‌మాల్‌

ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

New Update

AP Liquor Policy: ఏపీ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగింది. Rtv పరిశోధనలో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. Rtvకి ఫోన్లు చేసి మద్యం వ్యాపారులు గోడు వెల్లబోసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకం బెదిరింపులు  మద్యం వ్యాపారులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు సిండికేట్‌ అయ్యారని వ్యాపారులు ఆరోపణలు చేస్తున్నారు.

మద్యం షాపులకు టెండర్స్‌...

మద్యం షాపులు పంచుకునే విషయంలో కూటమిలోనే విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం షాపులకు టెండర్స్‌ జరుగుతుండగా..  మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మధ్య పోటీ గట్టిగానే జరుగుతోంది. టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, నర్సన్నపేట నియోజకవర్గాల్లో టెండర్స్ వేయడానికి మద్యం వ్యాపారులు భయపడుతున్నారు. 

మాజీ ఎమ్మెల్యే హల్‌చల్...

ఆముదాల వలసలో ఎమ్మెల్యే రవి కుమార్ వర్గీయుల హల్‌చల్ చేస్తున్నారు. అధికారం లేకపోయినా ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స అనుచరులదే పైచేయి కొనసాగుతోంది. పార్వతీపురం జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి టెండర్స్ వేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో రఘురామ అనుచరులదే హవా కొనసాగుతోంది. తన వారికి మద్యం షాపుల డ్రా తగలకపోతే పావలా వాటా ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు సమాచారం. పాలకొల్లులో కూటమి నాయకుల ఒప్పందాలు  ఇంకా కొలిక్కిరానట్లు తెలుస్తోంది.  తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో వైసీపీ, కూటమి సిండికేట్ జరుగుతోంది.

ఇలా చూసుకుంటే...

* ప్రకాశం జిల్లా మార్కాపురంలో 20 నుంచి 40 శాతం షేర్ ను ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సోదరుడు డిమాండ్ చేస్తున్నారు. 
* గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తమ్ముడు కృష్ణకిషోర్ రెడ్డిదే హవా జోరుగా ఉంది. 
* చీరాలలో ఎమ్మెల్యే బినామీ సూరగాని నరసింహరావుదే పైచేయి ఉంది. 
* కందుకూరులో 30 శాతం వాటా ఇవ్వాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
* ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మద్యం షాపుల కోసం తెలుగు తమ్మళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
* కావలిలో సిండికేట్ చేతుల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి షాపులు పెట్టేశారు.
* ఉదయగిరిలో ఆదాయం వచ్చే షాపులు తనవారికి దక్కేలా ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు.
* కోవూరు, నెల్లూరు రూరల్‌లో ప్రతీ షాపులో 25 శాతం తామే పెడతామని లీడర్స్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. 
* కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు అధికార పార్టీ నాయకుల సిండికేట్ నడుస్తోంది.
* కడపలో ప్రతి షాప్‌ నుంచి 30 శాతం షేర్ ను ఎమ్మెల్యే అనుచరుడు రాజగోపాల్ రెడ్డి  డిమాండ్ చేస్తున్నాడు.
* జమ్మలమడుగులో టీడీపీ ఇన్‌ఛార్జి రూపేష్‌ రెడ్డి, బాబాయి శివనాగిరెడ్డి కనుసన్నల్లో టెండర్స్ వ్యవహారం జోరుగా సాగుతోంది.
* బద్వేల్, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేటలో అంతంతమాత్రంగానే టెండర్స్ దాఖలు అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు