3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు!

ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు

New Update
Deadly Cyclones In World : ప్రపంచాన్ని వణికించిన 5 భారీ తుపానులు ఇవే.. ప్రాణ నష్టం వేలల్లో కాదు లక్షల్లో..!

AP : ఆంధ్రప్రదేశ్‌ లోని కొన్ని రోజుల పాటు విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం పలు జిల్లాల్లో వానలు కురిశాయి. ఎన్టీఆర్, తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, అనకాపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, కర్నూలుతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. 

రాజమండ్రిలో అత్యధికంగా 53 మి.మీ. వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో మాత్రం వేడి వాతావరణం ఉంది. అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, తుని,నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, కావలి, నెల్లూరు, కడప, కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.

Amaravati

ఏపీకి అమరావతి వాతావరణ కేంద్రం కీలక వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది. మరోవైపు ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ తుపాన్ల ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read :  అక్టోబర్ రక్తపాతం.. ఇజ్రాయెల్‌-హమాస్‌ ఏడాది యుద్ధన్మోదాన్ని చూపించే ఫొటోలు ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు