విషాదం.. భర్త, ఇద్దరు కుమారుల మృతి.. ‘మీరు లేని జీవితం నాకొద్దు’ ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో విషాదం జరిగింది. రెండు రోజుల క్రితం కట్టుకున్న భర్త, ఇద్దరు కుమారులు పోలవరం కుడి కాలువలో పడి చనిపోయారు. దీంతో రెండు రోజులుగా ఎక్కిఎక్కి ఏడ్చిన భార్య తీవ్ర మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. By Seetha Ram 11 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి కట్టుకున్న భర్త, కనీ పెంచిన కుమారులు ఒకేసారి మృతి చెందారు. దీంతో రెండు రోజులుగా ఎక్కిఎక్కి ఏడ్చిన భార్య.. ఆ విషాదం నుంచి తేరుకోలేకపోయింది. వారు లేని చోట ఉండలేను అనుకుంది. తలచుకుని తలచుకుని తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు రోజులు ఎక్కి ఎక్కి ఏడ్చి ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటకి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, దేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. రెండు రోజుల క్రితం పోలవరం కుడి కాలువలో పడి భర్త శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఇద్దరు కుమారులు మణికంఠ, సాయి కుమార్ మృతి చెందారు. ఈ ఊహించని ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే ఒకేసారి కట్టుకున్న భర్త, కన్న కొడుకులు దూరమవడంతో భార్య దేవి తీవ్ర మనస్థాపం చెందింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో దాదాపు రెండు రోజులు ఏడ్చి ఏడ్చింది. ఇక వారులేని జీవితం తనకు వద్దనుకుంది. బాత్‌రూంలో స్నానానికి వెళ్లిన దేవి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక స్నానానికి వెళ్లిన దేవి ఎంతసేపటికీ రాకపోయే సరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. దీంతో దేవి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. రెండు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Also Read : బతుకమ్మ సంబరాల్లో విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి #ap-crime-news #crime #wife #sucide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి