ఆంధ్రప్రదేశ్ AP: విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వారిదే: చలసాని శ్రీనివాస్ విభజన హామీలపై పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుందన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు ఉక్కు శాఖ మంత్రులుగా ఉన్నారని.. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వారిదేనని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రభుత్వాలు మారుతున్నా.. తీరని నీటి కష్టాలు.. ప్రాణాలకు తెగిస్తేనే మంచి నీళ్లు! ఏలూరు జిల్లా కొల్లేరు లంక గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా మంచినీటి సదుపాయం లేక లంక గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. జంగంపాడు గ్రామస్తులు ఇప్పటికీ బిందెడు నీళ్ల కోసం బండెడు కష్టాలు పడుతోన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ కు హరిరామజోగయ్య మరో లేఖ! కాపు నేత హరిరామజోగయ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి లేఖను రాశారు. ఆ లేఖలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కూడా కోరారు.అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కూడా సూచించారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఈ ప్రాజెక్టును పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే రోషన్ కుమార్ రైతుల సాగునీరు అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎర్రకాలువ ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టును పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. By Jyoshna Sappogula 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్చల్ .. తెలంగాణ వ్యక్తులపై దాడి..! ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు గుబ్బల మంగమ్మ గుడి దర్శనానంతరం అక్కడే విందు ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రాంతంలో విందు కార్యక్రమంలో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే అనుచరులు మద్యం మత్తులో వారిని చితకబాదారు. By Jyoshna Sappogula 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వార్.. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు, కేడర్ పాలకొల్లు వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వార్ నడుస్తోంది. నేతలు, కేడర్ రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత ఇన్‌ఛార్జి గోపాలరావును తప్పించాలని.. మేక శేషుబాబు, గుణ్ణం నాగబాబుల వర్గం డిమాండ్ చేస్తోంది. గోపాలరావురావు ఉంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. By Jyoshna Sappogula 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గుండెపోటు.. కారులో వెళ్తూ సిసిఎస్. ఎస్.ఐ మృతి..! పశ్చిమగోదావరి భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. సిసిఎస్ ఎస్.ఐ నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కారులో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావు మృతికి జిల్లా ఎస్పీ అజిత, పోలీస్ సిబ్బంది సంతాపం తెలిపారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎమ్మెల్సీగా జనసేన నేత నామినేషన్.. ఇనాళ్లు పరోక్షంగా.. ఎమ్మెల్సీగా జనసేన నేత హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్‌కి రుణపడి ఉంటానన్నారు. పవన్ కళ్యాణ్ ప్రపోజలను అంగీకరించిన చంద్రబాబుకి, లోకేష్‌కి ధన్యవాదాలు తెలిపారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కేజీ నేరేడు పండ్ల కోసం కొట్లాట.. వీధి వ్యాపారిపై పంచాయితీ సెక్రటరీ దౌర్జన్యం..! పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో వీధి వ్యాపారిపై పంచాయితీ సెక్రటరీ రెచ్చిపోయాడు. కేజీ నేరేడు పండ్లు 50 రూపాయలకు ఇవ్వనందుకు వ్యాపారి తోపుడు బండి మీద వున్న కాటా తీసుకెళ్ళిపోయాడు. రోడ్డుపై వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానంటూ సెక్రటరీ బెదిరింపులకు దిగాడు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn