AP: ఆర్టీసీ బస్సు బోల్తా.. వృద్ధురాలు మృతి హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడి ఊపరాడకపోవడంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా.. 17 మందికి పైగా తీవ్ర గాాయాల పాలయ్యారు. By Kusuma 15 Oct 2024 in క్రైం ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఓ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఈ దారుణం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఆర్టీసీ బస్సు ఏలూరుకి ప్రయాణిస్తోంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా.. బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురై బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడ్డారు. ఇది కూడా చూడండి: ఆ విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌కన్ కంపెనీలో సీఎం రేవంత్ అదుపు తప్పి బోల్తా పడటంతో.. ఇలా పడటం వల్ల బస్సులోని ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. ఇంతలో వేరే ప్రైవేట్ బస్సులోని వారు ప్రయాణికులను కాపాడారు. మొత్తం 36 మందితో ప్రయాణిస్తున్న బస్సులో వృద్ధురాలు విమలాబాయ్ మృతి చెందింది. ఒకరి మీద ఒకరు పడటం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చూడండి: Cinema:ఓటీటీలో అదరగొడుతున్న సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ 'ఉత్సవం' పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. బస్సు అదుపు తప్పడం వల్లే ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న తన నాలుగో కుమార్తెను చూసి వస్తుండగా.. ఆ వృద్ధురాలు మరణించింది. ఇది కూడా చూడండి: అబ్దుల్ కలాం తిరుపతికి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా..ఇంకా మర్చిపోని శ్రీవారి భక్తులు! ఈ ప్రమాద ఘటనలో ఆమెకు ఊపిరాడక, ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల చెయ్యి విరిగి పోయి ఎక్కువగా రక్తస్రావం అయ్యి మరణించింది. తల్లితో పాటు తన ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. తల్లి చావును దగ్గర నుంచి చూసిన వారు చలించిపోయారు. మిగతా వారికి తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చూడండి: Ap Rains:బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు! #accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి