/rtv/media/media_files/2025/03/16/kz5jFI8PugtCcyHjZbgX.jpg)
Dastagiri and wife
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని దస్తగిరి భార్య వెల్లడించింది. అంతేకాక తన భర్తని ఏడాదిలోపు చంపేస్తామని ఇద్దరు మహిళలు బెదిరించినట్లు పులివెందుల నియోజకవర్గం తొండూరు పోలీసులకు దస్తగిరి భార్య షాబానా ఫిర్యాదు చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్యాల గ్రామంలో నిన్న సాయంత్రం తనపై దాడి చేశారని తెలిపింది. మల్యాల గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లిన షాబానాపై ఇద్దరు మహిళా కార్యకర్తలు ఇంట్లోకి చొరబడి ఉద్దేశ పూర్వకంగానే బూతులు తిడుతూ తనపై దాడి చేశారని షాబానా తొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
ఏడాదిలోపు నీ భర్త దస్తగిరిని నరికేస్తామని ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు హెచ్చరించి కొట్టారని షాబానా ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నీ భర్త మాట్లాడేంత ధైర్యవంతుడా అంటూ విచక్షణారహితంగా కొట్టారని షాబానా వెల్లడించారు. అంతేకాదు విషయం తెలుసుకుని తన వద్దకు వచ్చిన భర్త దస్తగిరిని సైతం ఇద్దరు మహిళలు బెదిరించారని షాబానా చెప్పారు. మరో ఇంట్లో ఉన్న దస్తగిరి సమాచారం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి గన్మెన్లతో వచ్చినప్పటికీ ఇద్దరి మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దస్తగిరి దంపతులపై ఇష్టానుసారంగా పరుష పదజాలంతో మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివేకానందారెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకులను ఇరికించే విధంగా సీబీఐకి సాక్ష్యం చెబితే దస్తగిరిని ఏడాదిలోపే నరికేస్తామని ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించినట్లు ఫిర్యాదులో షాబానా పేర్కొన్నారు. తమపై దాడి చేసి వారితో పాటు ప్రేరేపించిన నాయకులను అరెస్ట్ చేయాలని షాబానా కోరారు. షాబానా ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
ఇటీవల రంగన్న చనిపోయిన వెంటనే నా భర్త దస్తగిరిని కూడా చంపడానికి వైఎస్సార్సీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని కావాలని ఉద్దేశ పూర్వకంగా గొడవలు పెట్టుకుని ఘర్షణలకు దారితీస్తున్నారని షాబానా పేర్కొన్నారు. తొండూరు పులివెందుల రూరల్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని షాబానా తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించాలని షాబానా విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?