కొడాలి నానికి బిగ్ షాక్..అస్సాంలో ప్రధాన అనుచరుడ్ని పట్టుకున్న పోలీసులు
వైసీపీ కీలక నేత,మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ పోలీసుల నుంచి పెద్ద షాక్ తగిలింది.నాని ప్రధాన అనుచరుడు కాళి ని పోలీసులు అస్సాంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
వైసీపీ కీలక నేత,మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ పోలీసుల నుంచి పెద్ద షాక్ తగిలింది.నాని ప్రధాన అనుచరుడు కాళి ని పోలీసులు అస్సాంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. నితిష్‌కు ప్రోత్సాహంగా రూ.25 లక్షలు అందిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు అందించనున్నారు.
వేసవి కాలంలో రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు మూడు నెలలు ముందే అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలోని రోడ్ల పక్కన ఈ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఏడాది కూటమి నేతలకు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారు. సంక్రాంతికి 10వేల నామినేటెడ్ పదవులు కేటాయించేందుకు సన్నాహకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. దీంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ అధికారులు సంజయ్‌పై కేసు నమోదు చేశారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పార్క్‌లో ఆడుతుండగా.. కార్పొరేషన్ గేటు దినేష్ అనే బాలుడుపై పడగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోధిస్తున్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కేవలం మూడు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సెలవులు ఇచ్చి, మిగతా రోజులు అదనపు తరగతులు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.