/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
ఏపీలో జరుగుతున్న కీడ్రా పోటీల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆటలాడుతూ గాయాలపాలయ్యారు. కబడ్డీ ఆడుతూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వెనక్కు పడిపోయారు. దీంతో ఆయన తలకు పెద్ద గాయమైంది. అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా కబడ్డీ ఆడుతూనే కింద పడిపోయారు. దీంతో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. మరోవైపు క్రికెట్ ఆడుతూ ఎమ్మెల్సీ రాంభూపాలరెడ్డి కింద పడిపోయారు. దీంతో ఆయనకు కూడా బాగా దెబ్బలు తగిలాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పోర్ట్స్ మీట్..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సందడిగా సాగుతోంది. నిన్న మొదలైన ఈ మీట్ మూడు రోజుల పాటూ జరగనుంది. ఇందులో ఆటలు ఆడుతున్న ఎమ్మెల్యేలు వరుసగా గాయాలపాలవుతున్నారు. నిన్న కూడా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గాయపడ్డారు. క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కింద పడిపోయిన విజయ్ కుమార్ ముఖానికి గాయాలయ్యాయి. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి కుట్లు పడతాయని చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు.
Also Read: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ