/rtv/media/media_files/WfHHEnrrP3RFI96YuLbu.jpg)
తిరుమల శ్రీవారి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం కారణంగా టీటీడీ భక్తులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 30న విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకుని.. టీటీడీ శ్రీవారి ఆలయంలో మార్చి 25న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఈ కారణంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే మార్చి 30 ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని.. సహస్ర దీపాలంకార సేవ మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
Also Read:Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది
తిరుమల దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 25, 30 తేదీలలో ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండనున్నాయని టీటీడీ అధికారులు ప్రకటించారు. మార్చి 24న, అలాగే మార్చి 29న వీఐపీ బ్రేక్ దర్శనాలకి సంబంధించి ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించమని టీటీడీ భక్తులకు తెలిపింది. ఈ అంశాలని భక్తలు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని టీటీడీ కోరింది.
Also Read:Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఏపీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమ, వారాల్లో మాత్రమే స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాలలో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
'ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు స్వీకరిస్తారు. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
Also Read: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
Also Read: Cm Chandra Babu: సీఎం చంద్రబాబు షాకింగ్ నిర్ణయం.. YSR జిల్లా పేరు మారుస్తూ నిర్ణయం