/rtv/media/media_files/2025/02/19/CZ1L32rmOFZSnqEeCmR4.jpg)
Tirumala
టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌కుమార్‌కి వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనకు దిగారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలిపారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర టీటీడీ ఉద్యోగిని తిట్టిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
Also Read: BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!
మంగళవారం ఉదయం కర్ణాటకకు చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌కుమార్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం దగ్గరకు రాగా.. నరేష్ కుమార్ తో పాటు వచ్చిన సహాయ వ్యక్తి గేటు తీయాలని ఉద్యోగి బాలాజీని అడిగారు. మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని.. ఒకవేళ దీనిపై ఏదైనా అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను కలవాలని బాలాజీ చెప్పారు.
Also Read: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
ఆ వెంటనే పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగిని దూషించారు. 'నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా. ఏయ్ నువ్వు బయటకు పోవయ్యా, థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు పెట్టారు. వాడి పేరేంటి. నీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్వు బయటకు పో, ఏం మాట్లాడుతున్నావు' అంటూ రెచ్చిపోయారు. వెంటనే అక్కడికి వచ్చిన టీటీడీ వీజీవో సురేంద్ర, పోటు ఏఈవో మునిరత్నం బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌కు సర్దిచెప్పి మహాద్వారం గేటు తీసి బయటకు పంపించారు.
నరేష్ కుమార్ తీరుపై టీటీడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని.. పాలకమండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్‌పై టీటీడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల నిరసనకు దిగడంతో టీటీడీ విజిలెన్స్ అక్కడ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై టీటీడీ ఛైర్మన్, ఈవోలు స్పందించాల్సి ఉంది. ఈ వివాదానికి టీటీడీ ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి.
Also Read: Trump: మస్క్ చేసేది అన్యాయయే..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Vijayawada: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు షాక్!
మేం రాగానే...టీడీపీ వాళ్లను నరికేస్తాం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు.
మాజీమంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఈ కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు తమపై కక్ష పెట్టుకోవద్దంటున్నారు.. అది మాత్రం జరగదు.. ఎవర్నీ వదలమని తెలిపారు. గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడుతామని... గుంటూరు అవతల వారిని అడ్డంగా నరుకుతామన్నారు. మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో వాళ్లింటికి మనిల్లు అంతే దూరమేనని తెలిపారు. గుంటూరు జిల్లా నేతలను లాక్కొచ్చి మరి నరికిపారేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో కారుమూరి వ్యాఖ్యలపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
BIG BREAKING: తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!
pregnant scam : 30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!
America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!
BIG BREAKING: ఆర్బీఐ గుడ్‌న్యూస్.. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గింపు
Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..