/rtv/media/media_files/2025/01/30/t3op60OWY7XzU86Jb30K.webp)
Araku Chilapanduga
Araku Chilapanduga: ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త టూరిజం పాలసీని సైతం ప్రవేశపెట్టింది. ఈ పాలసీలో భాగంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాంగా ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులో చలి పండుగ నిర్వహించేందుకు సిద్దమైంది. జనవరి 31 శుక్రవారం ప్రారంభమయ్యే ఈ పండుగ మూడు రోజులపాటు జరుగుతుంది.
Also Read: Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలన
ఈ కార్యక్రమంలో పర్యాటకులను ఆకట్టుకోవడానికి పలు ఆకర్షణనీయమైన కార్యక్రమాలను, పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. అరకు లోయలోని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ చలి పండుగను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో తొలి రోజు అయిన శుక్రవారం ఉదయం పద్మాపురం గార్డెన్ నుంచి కార్యక్రమ ప్రధాన వేదికైన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకూ అరకు మారథాన్ పరుగు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారు.
Also Read: Arvind Kejriwal: యమునా నది వివాదం.. కేజ్రీవాల్‌పై కేసు నమోదు !
11 గంటలకు పద్మాపురం గార్డెన్స్ లో ఫ్లవర్ షో, 12 గంటలకు అరకు ట్రైబల్ మ్యూజియంలో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫుడ్ స్టాల్స్ ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు పద్మాపురం గార్డెన్స్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకూ కార్నివాల్ పరేడ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో సంప్రదాయ గిరిజన నృత్యాలతో పాటు స్థానిక కళలను ప్రదర్శిస్తారు.
Also Read: నేను తాగే నీళ్లల్లో విషం.. ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్!
ఈ పండుగలో ఏం చేస్తారంటే....
ఫిబ్రవరి ఒకటిన బొర్రా గుహల నుంచి అరకు డిగ్రీ కాలేజ్ వరకూ సైక్లింగ్ ర్యాలీ ఉంటుంది. అరకు ఎంపీడీవో ఆఫీసు వద్ద 11 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. 12 గంటలకు డిగ్రీ కాలేజ్ లో అరకు బొకే ఇనాగ్రేషన్ ఉంటుంది. అనంతరం వాటి అమ్మకాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు అరకు కాఫీ హౌస్ లో కాఫీ పరిచయం ఉంటుంది. అక్కడే 3 గంటల నుంచి 4 గంటల వరకూ వక్తలు కాఫీ ప్రత్యేకత ఉపయోగాలపై మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఫ్యాషన్ షో, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరిగి ఫిబ్రవరి 2న ఆదివారం ఉదయం 7 గంటలకు అరకు సుంకమెట్ట కాఫీ తోటల నుంచి అరకు ట్రెక్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి అరకులో వాల్ పెయింటింగ్, 11 గంటలకు ముగ్గుల పోటీ ఉంటుంది. 12 గంటలకు ట్రైబల్ మ్యూజియంలో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మగింపు కార్యక్రమాలు, సాంస్కృతి కార్యక్రమాలు, లేజర్ షో కూడా ఉంటాయి. అలాగే ఈ మూడు రోజుల పాటు అరకులో హెలికాఫ్టర్ రైడ్ కూడా పర్యాటకుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు పలువురు ప్రముఖులు హాజరవ్వనున్నారు.
Also Read: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !